Movies' హ‌నుమాన్ ' ట్రైల‌ర్ లో ఈ సెన్షేష‌న్ ట్విస్ట్ గ‌మ‌నించారా...

‘ హ‌నుమాన్ ‘ ట్రైల‌ర్ లో ఈ సెన్షేష‌న్ ట్విస్ట్ గ‌మ‌నించారా ( వీడియో )

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్‌ చేస్తున్న హనుమాన్ సినిమా సంక్రాంతి బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆలస్యంగా సంక్రాంతి రేసులో ఉంది. సంక్రాంతికి మహేష్ బాబు, రవితేజ, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు సినిమాలు పోటీలో ఉన్నా కూడా కంటెంట్ మీద నమ్మకంతో హనుమాన్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా హీరోగా రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అంశం ఇప్పటికే మీడియాలో హైలెట్ అవుతోంది.

పాటలు అనుకున్న స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయినా.. సినిమా కంటెంట్ పై మాత్రం అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్లు గూస్ బంప్స్ మోత మోగిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. తేజ సజ్జా క్యారెక్టర్ తో మొదలైన ట్రైలర్ సముద్రంలో విజువల్స్ తో బాగా అట్రాక్ట్ చేసింది. చాలా బలంగా ఉండే హనుమాన్ ప్రతి ఒక్కరికి ఎలా తోడుగా ? ఉన్నాడు. ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు ఏమిటి ? పవర్ కోసం పరితపించే విలన్ గురించి హీరో ఏం తెలుసుకున్నాడు. హనుమాన్ విల‌న్‌ల‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా ట్రైలర్‌లో చూపించారు.

పవర్ కోసం ఎంతవరకైనా వెళ్లే విలన్లను హీరో ఎలా ఓడించాడు.. ఆ తర్వాత హనుమాన్ క్యారెక్టర్ ఎలా ?హైలెట్ కాబోతుంది.. అన్న క్యూరియాసిటీ ట్రైలర్‌లో క్రియేట్ చేశారు. ట్రైలర్ మొత్తం మీద విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా చివరలో రామ్ అనే బేస్ వాయిస్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తక్కువ బడ్జెట్ లోనే దర్శకుడు అదిరిపోయే విజువల్స్ తో ఎట్రాక్ట్ చేయబోతున్నట్టు అనిపిస్తుంది.

తేజ క్యారెక్టర్ అలాగే అతడికి సోదరిగా నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నట్టు ట్రైలర్‌లో చూపించారు. సినిమాలో గ్రాఫిక్స్ అదిరిపోయాయి. ట్రైలర్‌కు తగ్గ విజువల్స్ క్లిక్ అయితే సంక్రాంతి పోటీలో హనుమాన్ ఖచ్చితంగా పెద్ద హీరోల సినిమాలకు గట్టి పోటీ ఇస్తుంది అనటంలో సందేహం లేదు. పైగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతున్న జనవరి 12నే ఈ సినిమా కూడా విడుదలవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news