Movies' డెవిల్ ' ట్రైల‌ర్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేసిన క‌ళ్యాణ్‌రామ్‌... బాల‌య్య‌ డైలాగ్‌తో...

‘ డెవిల్ ‘ ట్రైల‌ర్‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టేసిన క‌ళ్యాణ్‌రామ్‌… బాల‌య్య‌ డైలాగ్‌తో చంపేశాడు ( వీడియో)

నందమూరి కళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన భారీ బ‌డ్జెట్ సినిమా డెవిల్‌. గ‌తేడాది బింబిసార లాంటి సోషియో ఫాంట‌సీ సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టిన క‌ళ్యాణ్‌రామ్ ఈ యేడాది ఆరంభంలో అమిగోస్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మెప్పించ‌లేక‌పోయారు. ఇక తాజాగా డెవిల్ సినిమాతో ఈ యేడాదికి ముగింపు ప‌లుకుతూ ఈ నెల 29న థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాడు.

అభిషేక్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై నామా అభిషేక్ ద‌ర్శ‌క నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. బింబిసార లాంటి వైవిధ్య‌మైన క‌థ‌తో సూప‌ర్ హిట్ కొట్టిన కళ్యాణ్‌రామ్ ఈ సారి కూడా డిఫ‌రెంట్ క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుండ‌డంతో ఖ‌చ్చితంగా హిట్ కొడ‌తాన‌న్న ధీమాతో ఉన్నాడు. క‌ళ్యాణ్‌రామ్ ఈ సినిమాలో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా క‌నిపిస్తున్నాడు. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్ ఈ సినిమాకు పెట్టారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఇటీవ‌ల రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ట్రైల‌ర్లో క‌ళ్యాణ్‌రామ్ లుక్స్‌, డైలాగ్స్‌, ఫైట్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌, విజువ‌ల్స్‌, యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ అదిరిపోయాయి. ట్రైల‌ర్‌లో అయితే క‌ళ్యాణ్‌రామ్ మ‌రోసారి న‌ట విశ్వ‌రూపం చూపించేశాడు. బింబిసార‌లో క‌ళ్యాణ్‌రామ్ న‌ట‌న న‌ట‌న‌తో ఎంత అద‌ర‌గొట్టాడో ఈ సినిమాలోనూ అదే స్తాయిలో విశ్వ‌రూపం చూపించిన‌ట్టు ట్రైల‌ర్ చూస్తేనే అర్థ‌మ‌వుతోంది.

బ్రిటీష్ కాలంలో జ‌రిగిన ఓ హ‌త్య కేసుకు సంబంధించిన విచార‌ణ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ కొన‌సాగుతుంద‌ని తెలుస్తోంది. ట్రైల‌ర్ చివ‌ర్లో వేసిన విశ్వాసంగా ప‌డి ఉండ‌డానికి కుక్క‌ను కాదురా.. ల‌య‌న్ అన్న డైలాగ్ చూస్తే బ్రిటీష్ వారి ద‌గ్గ‌రే ప‌నిచేస్తూ వారికే ఎలా ఎదురు తిరుగుతాడు హీరో అన్నదే క‌థ అని తెలుస్తోంది. ఇక బాల‌య్య సెంటిమెంట్ ప‌దం ల‌య‌న్‌ను క‌ళ్యాణ్‌రామ్ ఇంత ప‌వ‌ర్ ఫుల్‌గా వాడ‌డంతో ఇది సినిమాకు ప్ల‌స్ అయ్యేలా ఉంది. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. సంయుక్త‌మీన‌న్ హీరోయిన్‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news