Newsఇప్పటి వరకు ఏ సినిమా కోసం చేయని పనిని.. గుంటూరు కారం...

ఇప్పటి వరకు ఏ సినిమా కోసం చేయని పనిని.. గుంటూరు కారం కోసం చేసిన శ్రీలీల.. !

శ్రీ లీల .. ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీనిషేక్ చేస్తున్న పేరు . ఏ స్టార్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లిన .. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లిన .. సీనియర్ హీరో దగ్గరికి వెళ్లిన .. యంగ్ హీరోస్ దగ్గరికి వెళ్లిన .. అమ్మడి పేరే మారుమ్రోగిపోతూ ఉంటుంది. అమ్మడిని హీరోయిన్గా పెట్టాలి అంటూ కోరుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరూ శ్రీలీల పేరుని జపిస్తూ ఉండడం గమనార్హం. కాగా లేటెస్ట్ గా శ్రీదేవి నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి .

ఆది కేశవ ఆ తర్వాత రిలీజ్ అయిన ఎక్స్ట్రాడినరీ.. రెండు కూడా అమ్మడుకు భారీ దెబ్బ వేశాయి. కోట్లలో నష్టం వచ్చింది మేకర్స్ కి. దీంతో శ్రీలీలను ఎక్కడ ఐరన్ లెగ్ చేసేస్తారు రా బాబోయ్ అంటూ జనాలు ఫీల్ అయిపోతున్నారు. ఇలాంటి క్రమంలోనే ఆమె తన ఆశలు అన్ని నెక్స్ట్ సినిమా గుంటూరు కారం పైనే పెట్టుకొని ఉంది . గుంటూరు కారం సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది .

మీనాక్షి చౌదరి మరో మరో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో శ్రీ లీల ఓ పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతుందట . అంతేకాదు ఫారిన్ కంట్రీస్ లో చదువుకోవాలన్న ఆశ ఉండే అమ్మాయి పల్లెటూరి కట్టుబాట్లు కారణంగా పల్లెటూరులో ఉండిపోతే ఎలా ఉంటుంది అనేది ఆమె క్యారెక్టర్. అంతేకాదు శ్రీ లీల ఈ సినిమాలో చాలా నేచురల్ లుక్స్ లో కనిపించబోతుందట.

లంగా వోణీలో ఇంటి పనులు చేసుకునే సామాన్య మధ్యతరగతి అమ్మాయిగా కనిపించబోతుందట. ఇప్పటివరకు శ్రీ లీల ఎక్కడా కూడా కామన్ గర్ల్ గా కనిపించలేదు . సినిమాలలో బాగా రిచ్ హీరోయిన్ గానే కనిపించింది , ఫస్ట్ టైం గుంటూరు కారం సినిమాలో సామాన్య అమ్మాయి క్యారెక్టర్ రోల్ చేస్తూ ఇంటిపనులు వంట పనులు కూడా డూప్ లేకుండా తానే చేసిందట . దీంతో అమ్మడు పేరు మారుమ్రోగిపోతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news