Moviesబాహుబలి vs సలార్: ఏ సినిమా అభిమానులను బాగా మెప్పించింది...

బాహుబలి vs సలార్: ఏ సినిమా అభిమానులను బాగా మెప్పించింది అంటే..? అన్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్స్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫ్యాన్స్ తమ ఒపీనియన్ ను ఓపెన్ గా చెప్పడం మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా బడా స్టార్ సెలబ్రెటీస్ కి సంబంధించిన సినిమాల విషయాల గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉంటాయి. రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ సినిమా అభిమానులను ఎంతగా ఆకట్టుకుందో మనం చూసాం . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో కుమ్మి పడేసాడు .

నటన అంటే ఇదే అనే రేంజ్ లో నటించి ప్రూవ్ చేసుకున్నాడు . అయితే ప్రభాస్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగి పోవడానికి కారణం బాహుబలి. రాజమౌళి ఈ సినిమాను అంత బాగా తెరకెక్కించాడో మనకు తెలిసిందే. సలార్ సినిమా కూడా 100 బాహుబలిలకు సమానమని కామెంట్స్ రావడంతో సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోల్ సర్కులేట్ అవుతుంది.

బాహుబలి సలార్ ఈ రెండు సినిమాలలో ప్రభాస్ అభిమానులకి బాగా నచ్చిన మూవీ ఏంటి అంటూ పోల్ వైరల్ అవుతుంది. అయితే చాలామంది 50% బాహుబలి 50% సలార్ అంటూ ఆన్సర్ ఇస్తున్నారు రెండు సినిమాలలో ప్రభాస్ ఇరగదీసాడు.. ప్రాణం పోశాడు .. అమరేంద్ర బాహుబలి గా ప్రభాస్ ను తప్పిస్తే ఎవరిని ఊహించుకోలేం.. అలాగే సలార్ సినిమాలో దేవా పాత్రలో ప్రభాస్ పర్ఫెక్ట్ . ఇద్దరి రోల్స్ కు తగిన న్యాయం చేశాడు. ఏ సినిమా గొప్ప అంటే ఏ గొప్ప చెప్పలేం . అది అదే ఇది ఇదే అంటూ చెప్పుకొస్తున్నారు. మరి మీకు ఏ సినిమా నచ్చింది..? బాహుబలి నా..? సలార్ నా..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news