Moviesనా సామిరంగ నుంచి అంజిగాడు వ‌చ్చేశాడు... అల్ల‌రోడు ఇర‌గ‌దీసిండు ( వీడియో...

నా సామిరంగ నుంచి అంజిగాడు వ‌చ్చేశాడు… అల్ల‌రోడు ఇర‌గ‌దీసిండు ( వీడియో )

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో, విజయ్ బిన్నీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ నా సామిరంగ. నాలుగు నెల‌ల క్రిత‌మే షూటింగ్ ప్రారంభ‌మైన ఈ సినిమాను సంక్రాంతి రేసులో రిలీజ్ చేస్తున్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశారు. సంక్రాంతికి మ‌హేష్‌, వెంక‌టేష్‌, ర‌వితేజ‌, తేజ స‌జ్జా లాంటి హీరోల ప్రెస్టేజియ‌స్ సినిమాలు పోటీలో ఉన్నా కూడా నాగార్జున కూడా ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌కుండా త‌న సినిమాను రేసులో దించుతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న‌లు ప‌దే ప‌దే చేస్తున్నారు.

ఇక ఇటీవ‌ల రిలీజ్ అయిన మా వ‌ర‌ల‌క్ష్మి అంటూ హీరోయిన్ ఆశికా రంగ‌నాథ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్సాన్స్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న అల్ల‌రి న‌రేష్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. మా అంజిగాడిని ప‌రిచ‌యం చేస్తున్నాం అంటూ వీడియో వ‌దిలారు. ఈ వీడియోలో అల్లరి నరేష్ సూపర్ ఎనర్జిటిక్ గా ఉన్నారు.

మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమాలో పాత్రకు భిన్నంగా ఈ అంజిగాడు చ‌లాకీగా క‌నిపిస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news