News' యానిమ‌ల్ ' ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్లు... అంచ‌నాల‌ను మించిపోయిందిగా...!

‘ యానిమ‌ల్ ‘ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్‌వైడ్ క‌లెక్ష‌న్లు… అంచ‌నాల‌ను మించిపోయిందిగా…!

రణబీర్ కపూర్, రష్మిక మంద‌న్న‌ జంటగా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా రిలీజ్ కి ముందు ఎలాంటి అంచనాలు, హైప్ క్రియేట్ చేసిందో చూశాం. భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి రోజు వచ్చిన వసూళ్లు ఎలా ఉన్నాయి ? హైప్‌కు తగ్గ రేంజ్‌లోనే యానిమల్ వసూళ్లు ఉన్నాయా అంటే అవుననే చెప్పాలి. ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా రు. 61 కోట్ల రూపాయల నెట్‌ వచ్చింది. రణ‌బీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. ఓవరాల్ గా చూసుకుంటే తొలిరోజు వసూళ్లలో యానిమల్ రెండో స్థానంలో నిలిచింది.

భారీ ఓపెనింగ్స్ తో మొదటి స్థానంలో షారుక్ ఖాన్‌ జవాన్ రూ..75 కోట్లతో ఉండగా.. రెండో స్థానంలో యానిమల్ ఉంది. ఈ క్రమంలో షారుక్ నటించిన పఠాన్, సన్నీడియోల్ చేసిన గదర్ 2 సినిమాలను యానిమల్ పక్కకు నెట్టింది. అటు ఓవర్సీస్ లో ఈ సినిమాకు కళ్ళు చెదిరే వసూళ్లు వచ్చాయి. ప్రీమియర్లతో కలుపుకుని తొలి రోజు ఏకంగా రూ.2.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది యానిమల్ సినిమా.

అలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మొదటి రోజు ఏకంగా రూ.116 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో తొలిరోజు 1,318 షోలు పడ్డాయి. ఇండియాలో ఇదే హైయెస్ట్. ఇక్క‌డ 79 % ఆక్య‌పెన్సీ న‌మోదు అయ్యింది. ముంబైలో 55% ఆక్యుఫెన్సీ తో 1,040 షోలు వేశారు. హైదరాబాద్‌లో ఈ సినిమాకు 82% ఆక్యు పెన్సితో 316 షోలు పడ్డాయి. చెన్నైలో మాత్రం కేవలం 30 శాతం ఆక్యు పెన్సితో 88 షోలు మాత్రమే పడ్డాయి. యానిమల్ సినిమాకు మొదటి రోజు దేశవ్యాప్తంగా యావరేజ్ టాక్‌ వచ్చినా కూడా.. సినిమాపై ఉన్న క్రేజ్ కారణంగా ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

అయితే సినిమా రెండో రోజు నుంచి పుంజుకుంటుంది అంటున్నారు. మరి ఈ టాక్ తో ఈ సినిమా ఎన్ని రోజులు నడుస్తుంది.. ఎంత కలెక్ట్ చేస్తుంది ? అన్నది ఆసక్తికరమే. అయితే 3 గంటలు 21 నిమిషాల భారీ రన్ టైం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు భరిస్తారా.. లేదా.. అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news