Movies2023 టాలీవుడ్‌లో క్లిక్ అయిన ఒకే ఒక్క హీరోయిన్... గోల్డెన్ గ‌ర్ల్‌..!

2023 టాలీవుడ్‌లో క్లిక్ అయిన ఒకే ఒక్క హీరోయిన్… గోల్డెన్ గ‌ర్ల్‌..!

2023 ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ లో ఏ హీరోయిన్ పాపులర్ అయింది ? ఏ హీరోయిన్ సక్సెస్ లు కొట్టారు ? ఏ హీరోయిన్ కు సక్సెస్ దక్కలేదు అన్నది చూస్తే ఆసక్తికరమే. రోజూ వార్తల్లో ఉండే రష్మిక 2023లో తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే యానిమల్ సినిమాతో మాత్రం ఆమె దేశవ్యాప్తంగా పాపులర్ అయింది.. ఈ సినిమా ఆమె కెరీర్ కు మంచి ప్లస్ అయింది. ఆశ్చర్యకరంగా ఫేడ‌వుట్‌ దశలో ఉన్న శృతిహాసన్ ఈ ఏడాది మెరిసింది.

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు హిట్లు కొట్టింది. తాజాగా నాని హాయ్ నాన్న సినిమాలో స్పెషల్ రోల్ చేసి మెప్పించింది. ఇప్పుడు సలార్ కోసం ఎదురుచూస్తోంది. అలా ఈ ఏడాది బిగ్గెస్ట్ హీరోయిన్గా నిలిచింది శృతిహాసన్. ఆమె తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అందుకున్న నటి సంయుక్తా మీన‌న్‌. సర్, విరూపాక్ష సినిమాలతో వరుసగా హిట్లు కొట్టిన ఆమె ప్రస్తుతం కళ్యాణ్‌రామ్ డెవిల్ సినిమా కోసం వెయిటింగ్ చేస్తోంది. ఈ సినిమా కూడా సక్సెస్ అయితే ఆమె ఈ ఏడాది హ్యాట్రిక్ కొట్టినట్టే.

కాస్త గ్యాప్ తీసుకుని వచ్చిన 2023లో సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది అనుష్క. మిస్‌ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో సక్సెస్ కొట్టింది. అటు సమంత కూడా శాకుంతలం లాంటి డిజాస్టర్ తర్వాత ఖుషి సినిమాతో జస్ట్ ఓకే అనిపించుకుంది. హాయ్ నాన్న సినిమాతో మృణాల్‌, బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య, సామజవరగమన సినిమాతో రెబా మౌనిక జాన్, దసరాతో కీర్తి సురేష్, భగవంత్‌ కేసరితో శ్రీలీల సక్సెస్ అందుకున్నారు.

అయితే శ్రీలీలకు ఈ యేడాది ఒక సినిమా సక్సెస్ అయితే స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూడు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. భోళాశంకర్ సినిమాతో కీర్తి సురేష్, తమన్నా కూడా ప్లాపులు అందుకున్నారు. కృతిశెట్టి కూడా క‌స్ట‌డీ సినిమాతో ప్లాప్ కొట్టింది. అలాగే చాలామంది హీరోయిన్లు ఈ ఏడాది బోణీ కొట్టలేకపోయారు. ఓవరాల్ గా చూస్తే ఈ ఏడాది శృతిహాసన్ సక్సెస్ఫుల్ హీరోయిన్ గా నిలవగా సంయుక్తమీన‌న్‌ పరవాలేదు అనిపించుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news