Newsటాలీవుడ్‌లో ప్రణీత కెరీర్‌ను దారుణంగా దెబ్బ‌కొట్టిన హీరోయిన్‌... ఏం చేసిందంటే...!

టాలీవుడ్‌లో ప్రణీత కెరీర్‌ను దారుణంగా దెబ్బ‌కొట్టిన హీరోయిన్‌… ఏం చేసిందంటే…!

అత్తారింటికి దారేది..ఈ సినిమా అన్ని రకాలుగా ఓ సంచలనం అని చెప్పాలి. పవన్ కళ్యాణ్, సమమ్ర, ప్రణీత హీరోహీరోయిన్లుగా నటించారు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. సగం సినిమా యూట్యూబ్ లో వచ్చేసినా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు రాబట్టిన మొదటి సినిమా. త్రివిక్రం సినిమాలో పాయింట్ చాలా చిన్నదే అయినా ఆ ఒక్క పాయింట్ చుట్టే అన్నీ ఎమోషన్స్ ని నింప్రస్తాడు.

మాటలతో మాయ చేసి థియేటర్స్ లో ఆడియన్స్ ని కట్టిపడేస్తాడు. హీరోకి మంచి స్టార్ డం తెచ్చిపెడతాడు. అయితే, త్రివిక్రం సినిమాలలో హీరోయిన్స్ కి అంతగా ప్రాధాన్యం ఉండదనే అపవాదు ఒకటుంది. అలాగే, సెకండ్ లీడ్ గా నటించిన ఏ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది లేదు. పార్వతీ మెల్టన్, నిత్యా మీనన్, ప్రణీత, ఈషా రెబ్బ, నివేత పేతురాజ్..లాంటి వారిని చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

చెప్పాలంటే, రెండవ హీరోయిన్ కి ఏదో చెప్పి ఒప్పిస్తాడు. కానీ, సినిమా చేసిన తర్వాత వారికి కాసింత క్రేజ్ కూడా దక్కదు. అలా ఇప్పటికి చాలా హీరోయిన్ త్రివిక్రం ని నమ్మి మోసపోయారని చెప్పాలి. అందరికంటే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది ప్రణీత. ఈ బ్యూటీ కెరీర్‌లో ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. ఫిజిక్ అంతా బావున్నప్పటికీ మంచి పర్ఫార్మర్ అయినప్పటికీ కెరీర్ మాత్రం రివర్స్ అయింది.

పవన్ కళ్యాణ్ పక్కన ఓ హీరోయిన్‌గా మంచి క్యారెక్టర్..ఆయనతో డ్యూయట్ ఉంటుందీ..మంచి సీన్స్ ఉన్నాయి అని చెప్పి అత్తారింటికి దారేది సినిమాకి ఒప్పించాడు త్రివిక్రం. అంతేకాదు, కథలో సమంత కంటే నీదే చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పారట. తీరా సినిమా చూశాక అసలు ప్రణీత ఎందుకు ఈ సినిమా ఒప్పుకుందో తెలీదు. మంచి సాంగ్ ఉన్నా కూడా సమంత ఉండేసరికి అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత ఉందనే విషయం ఎవరీ గుర్తుండదు. ఆ రకంగా ప్రణీత అత్తారింటికి దారేది సినిమా చేసి దెబ్బైపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news