Newsకెరీర్ లో ఎన్టీఆర్ మరో బోల్డ్ స్టెప్.. ప్రశాంత్ నీల్ మూవీ...

కెరీర్ లో ఎన్టీఆర్ మరో బోల్డ్ స్టెప్.. ప్రశాంత్ నీల్ మూవీ తరువాత ఆయన చేయబోయే సినిమా ఇదే..!

ప్రజెంట్ ఎన్టీఆర్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే ప్రశాంత్ నీల్ తో తన 31 వ సినిమాలో నటించబోతున్నాడు . ఆ తర్వాత వెంటనే దేవర 2 సినిమాకి సంబంధించిన పనులు ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు . అయితే ఇలా బ్యాక్ టు బ్యాక్ బిజీగా ఉన్న తారక్ లైఫ్ లో కొత్త స్టెప్ తీసుకోవడానికి ముందుకు వెళ్తున్నారట.

కేవలం యాక్టింగ్ ఏ కాకుండా ప్రొడ్యూసింగ్ సైడ్ కూడా వెళ్లాలి అంటూ ఎన్టీఆర్ డిసైడ్ అయ్యారట . ఎన్టీఆర్ త్వరలోనే ఓ ప్రొడక్షన్ హౌస్ ని లాంచ్ చేయబోతున్నారట . అంతేకాదు సినిమాలను నిర్మించాలని కూడా డిసైడ్ అయ్యారట . టాలెంట్ ఉండి ఇండస్ట్రీలోకి రావాలి అన్న ఆలోచనలు ఉన్నా కూడా అవకాశాలు లేక అల్లాడిపోతున్న టాలెంటెడ్ పీపుల్స్ కోసం ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో డిఫరెంట్గా ఆలోచించడం ఎన్టీఆర్ తర్వాతే మరి ఎవరైనా అంటూ నందమూరి ఫ్యాన్స్ ఈ వార్తని ట్రెండ్ చేస్తున్నారు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్..తన దైన స్టైల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. గ్లోబల్ స్ధాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు తారక్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news