Newsవరుణ్-లావణ్య కు నందమూరి బాలకృష్ణ స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..లైఫ్...

వరుణ్-లావణ్య కు నందమూరి బాలకృష్ణ స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..లైఫ్ లాంగ్ గుర్తు ఉండిపోయేది..!!

కొత్త జంటకు నందమూరి బాలకృష్ణ అదిరిపోయే గిఫ్ట్ పంపించాడు అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే రీసెంట్ గానే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నారు . ఆరేళ్లుగా గుట్టి చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతున్న ఈ జంట ఫైనల్లి ఇంట్లో పెద్దలను ఒప్పించి ఇటలీలో మూడు రోజుల పాటు పెళ్లి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు .

రీసెంట్ గానే హైదరాబాద్ కి వచ్చారు. మరికొద్ది గంటల్లోనే వీళ్ల రిసెప్షన్ ఘనంగా జరగబోతుంది . అయితే బాలకృష్ణ నూతన వధూవరులకు అదిరిపోయే గిఫ్ట్ పంపించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . నాగబాబు ఆయన భార్య వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు . అంతేకాదు వరుణ్ తేజ్ కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతూ ఉంటాడు . ఈ క్రమంలోనే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పెద్ద ఫోటోగ్రఫీ ని గిఫ్ట్ చేశారట.

పుల్లలతో చేసిన స్పెషల్ ఆకర్షణీయంగా కనిపించే వెంకటేశ్వర స్వామి ఫోటోను గిఫ్ట్ చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటూ బ్లెస్స్ చేస్తూ గ్రీటింగ్ కార్డు కూడా పంపించారట . బాలకృష్ణ తలుచుకుంటే కోటి రూపాయలు పెట్టి గిఫ్ట్ పంపించవచ్చు . కానీ అంతకన్నా విలువైన ఆశీర్వాదాలను ఆ దేవుడు ఆశీర్వాదాలు మీకు ఎప్పుడూ ఉండాలి అని వాళ్ళ ఫేవరెట్ దేవుడినే వాళ్ళ ఇంటికి పంపించారు. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుంది చెప్పండి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news