Moviesఅనిల్ రావిపూడి రాజకియాలోకి వచ్చేస్తున్నాడోచ్.. ఏ పార్టి నుంచి పోటీ చేయబోతున్నారంటే..?(ఫుల్...

అనిల్ రావిపూడి రాజకియాలోకి వచ్చేస్తున్నాడోచ్.. ఏ పార్టి నుంచి పోటీ చేయబోతున్నారంటే..?(ఫుల్ వీడియో)..!!

వామ్మో.. ఏంటిది ..అనిల్ రావిపూడి రాజకీయాల్లోకి రాబోతున్నారా..? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ..? అసలు ఈ డైరెక్టర్ ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నాడు..? సినిమాలు బాగానే సక్సెస్ అవుతున్నాయి కదా..? ఇలా రకరకాల కామెంట్స్ తో అనిల్ రావిపూడి పేరుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. దానికి కారణం రీసెంట్గా ఆయన షేర్ చేసిన వీడియోనే. అనిల్ రావిపూడి రాజకీయ లలోకి రాబోతున్నాను అంటూ ఆయన స్వయంగా ప్రకటించారు .

అయితే ఇది తెరపై కనపడే రాజకీయం .. మోసాలు చేసే రాజకీయం కాదండోయ్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాతో కలిసి ఓ ఫన్నీ గేమ్ ను డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి . ఈ గేమ్ కి సంబంధించిన షో కోసమే ఇలా ప్రమోషన్ వీడియోను రిలీజ్ చేశారు . ఈ వీడియోలో అనిల్ రావిపూడి కొత్త గెటప్ అదిరిపోయింది . పట్టు పంచతో కండువా కప్పుకొని .. కళ్ళకు గ్లాసెస్ పెట్టుకొని .. అచ్చం ట్రెండీ రాజకీయ నాయకుడిగా కనిపించాడు . అంతేకాదు ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశాడు.

అనిల్ రావిపూడి మాట్లాడుతూ..” నేను డైరెక్ట్ చేశాను ..మీరు నా సినిమాలు హిట్ చేశారు ..నేను ఎంటర్టైన్ చేశాను ..మీరు ఎంటర్టైన్ అయ్యారు ..ప్రతిసారి గెలిచేది నేనే అయినా నన్ను గెలిపించేది మాత్రం మీరే..కానీ ఈసారి నా గెలుపు థియేటర్లో ఉండదు. ఓ అసెంబ్లీ ఓ పార్లమెంట్ అలా ప్లాన్ చేద్దామనుకుంటున్నాను.. పంపిస్తారుగా పంపిస్తారులే.. బాక్సాఫీసును షేక్ చేసిన నాకు.. బ్యాలెట్ బాక్స్ సక్సెస్ చూడాలని ఉంది .. అదేనండి మనం పార్టీ పెట్టబోతున్నాం.. మన పార్టీ పేరేంటో..? ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరు..? మొత్తం త్వరలోనే మీకు వివరిస్తాను ” అంటూ షోపై ఫుల్ హైప్స్ పెంచేసాడు అనిల్ రావిపూడి . దీంతో అనిల్ రావిపూడి కొత్త అవతారం నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news