Moviesవామ్మో..ఏంటి ఇది.. ఈ అమ్మాయికి మన బన్ని అలాంటి మెసేజ్ పెట్టాడు..?

వామ్మో..ఏంటి ఇది.. ఈ అమ్మాయికి మన బన్ని అలాంటి మెసేజ్ పెట్టాడు..?

వాట్ ఈ అమ్మాయికి మన బన్నీ మెసేజ్ చేశాడా..? ఏంటిది ఏం జరుగుతుంది ..? ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ బన్నీ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రంబోలా చేస్తున్నారు . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయికి బన్నీ మెసేజ్ చేశాడట . ఈ విషయాన్ని ఆమె స్వయంగా స్క్రీన్ షాట్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రంబోలా చేస్తుంది. అసలు ఈ అమ్మాయి ఎవరు..? బన్నీకి ఏమవుతుంది..? బన్నీ మెసేజ్ చేయడానికి కారణం ఏంటి..? అనేటివి ఇక్కడ చూద్దాం.

సోషల్ మీడియాలో కరోలిన్ షేక్స్ పేరిట ఒక అకౌంట్ ఉంది . విదేశీ అమ్మాయిలానే కనిపిస్తుంది . ఆమె ఫోటోలకు నెటిజన్లు ఎప్పుడు ఫిదా అవుతూనే ఉంటారు. చాలా క్యూట్గా ట్రెండీగా మోడ్రన్ గా హెయిర్ స్టైల్ బాగుంటుంది అంటూ కూడా చెప్పుకొస్తూ ఉంటారు . ఆమెకు దాదాపు రెండు లక్షల 50 వేలకు పైగా ఫాలోవర్లు కూడా ఉన్నారు . అయితే ఆ అమ్మాయికి మన బన్నీ పర్సనల్గా మెసేజ్ చేశాడు అన్న స్క్రీన్ షాట్లు ఇక్కడ వైరల్ అవుతున్నాయి .

“మీ ఫోటోలు పోస్ట్లు ఎంతో క్యూట్గా ఫన్నీగా ఉన్నాయి.. గాడ్ బ్లెస్ ఇలానే ముందుకు వెళుతూ ఉండు ” అంటూ బన్నీ మెసేజ్ పెట్టినట్టుగా ఇక్కడ ఉంది. అయితే ఆ అమ్మాయి ని హీరో నవదీప్ కూడా బాగానే ఫాలో అవుతున్నాడు . నెక్స్ట్ సినిమాలో ఏమైనా రోల్ కి సజెస్ట్ చేసుకుంటాడా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ మెసేజ్ నిజంగానే బన్నీ పెట్టాడా..? లేకపోతే ఫేక్ అకౌంట్ నుంచి ఇలా క్రియేట్ చేసి ఈ విధంగా పబ్లిసిటీ సంపాదించుకోవడానికి చూస్తున్నారా..? అన్నది తెలియాల్సి ఉంది . బన్నీ ఫాన్స్ అయితే ఇది మొత్తం ఫేక్ అని బన్నీకి అసలు మెసేజ్ పెట్టే తీరిక ఉందా ..? అంటూ కూడా కౌంటర్ లు వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news