Newsబాహుబలి-KGF-దేవర..ఇప్పుడు చిరంజివి-వశిష్ట సినిమా..అన్ని మూవీలోను అదే కామన్ పాయింటా..?

బాహుబలి-KGF-దేవర..ఇప్పుడు చిరంజివి-వశిష్ట సినిమా..అన్ని మూవీలోను అదే కామన్ పాయింటా..?

ఈ మధ్యకాలంలో ఒక సినిమాను చూసి మరొక సినిమా అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది . ఒక డైరెక్టర్ ఏ విధంగా సినిమాను తెరకెక్కిస్తారో అదే కీ పాయింట్స్ ను కాపీ కొట్టి మరొక డైరెక్టర్ అలా అలా మసాలాలు దట్టించి .. సినిమాను తెరకెక్కించడం చాలా కామన్ గా చూస్తున్నాం . ఈ మధ్యకాలంలో ముఖ్యంగా సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించడం అనేది చాలా చాలా కామన్ గా మారిపోయింది . ఇప్పటికే బాహుబలి సినిమాను చూసి చాలా సినిమాలు రెండు భాగాలుగా వస్తున్నాయి.

బాహుబలి తర్వాత కే జి ఎఫ్ వచ్చి హిట్ కొట్టింది . ఇప్పుడు ఈ రెండు సినిమాలను చూసి ఎన్టీఆర్ దేవర కూడా రెండు భాగాలుగా రాబోతుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కించాలని వశిష్ట ప్లాన్ చేస్తున్నారట . ఇదే రూట్ ను ఇంప్లిమెంట్ చేస్తూ ఫస్ట్ పార్ట్ లో అసలు కథ చెప్పకుండా ఫ్లాష్ బ్యాక్ వివరించి సెకండ్ పార్ట్ లో అసలు ఎలా జరిగింది? ఏం జరిగింది ..? అనేది చూపించబోతున్నారట.

నిజానికి మెగాస్టార్ చిరంజీవి లాంటి ఏజ్ గల హీరోతో రెండు భాగాలుగా సినిమాను తెరకెక్కించడం బిగ్ రిస్క్ అని చెప్పాలి. అయితే ఏం చూసుకొని ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నాడో..? ఆయనకే తెలియాలి అంటున్నారు సినీ ప్రముఖులు . చూద్దాం మరి వశిష్ట తెలివి ఎంతవరకు సక్సెస్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news