Newsబాల‌య్య - బోయ‌పాటి అఖండ 2కు అడ్డుప‌డుతోన్న ఆ స్టార్ హీరో...

బాల‌య్య – బోయ‌పాటి అఖండ 2కు అడ్డుప‌డుతోన్న ఆ స్టార్ హీరో ఎవ‌రు ?

బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో చూశాం. నిజం చెప్పాలంటే ఈ సినిమాతోనే బాలయ్య కెరీర్ కు ఈ వయసులో కూడా మంచి ఊపు వచ్చింది. అఖండ సక్సెస్ కంటిన్యూ చేస్తూ బాలయ్య వీరసింహారెడ్డి తో కూడా సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు భగవంత్‌ కేసరి సినిమాతో వరుసగా మూడో విజయం తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అఖండ సూపర్ హిట్ అయ్యాక ఆ సినిమాకు సిక్వెల్ గా అఖండ 2 సినిమా వస్తుందని బోయపాటి ఇప్పటికే ప్రకటించారు.

అటు నందమూరి, బాలయ్య అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులు అందరూ అఖండ 2 ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా ? అని ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తాజాగా బోయపాటి యంగ్ హీరో రామ్‌తో స్కంద సినిమా తెర‌కెక్కించారు. ఈ సినిమా అంచనాలు అందుకోలేదు. అయితే బోయపాటి స్కంద సీక్వెల్ గా స్కంద 2 కూడా ఉంటుందని ప్రకటించారు. అయితే స్కంద 2 ఉంటుంద‌ని ఇప్పట్లో అనుకోలేము.

ఇక బోయపాటి తాజాగా తన తర్వాత సినిమా అఖండ 2 ఉంటుందని చెప్పికనే చెప్పేశారు. ఇప్పటికే అఖండ 2 కసరత్తులు కూడా మొదలయ్యాయి. అయితే బాలయ్య భగవంత్‌ కేసరి సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత కూడా బాలయ్య మరో సినిమా చేస్తారని తెలుస్తోంది. ఈలోగా తమిళ్ స్టార్ హీరో సూర్య బోయపాటితో ఒక మాస్ సినిమా చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

ఈ గ్యాప్ లో బోయపాటి సూర్య సినిమాకు కమిట్ అయితే అఖండ 2 సెట్స్ మీదకు వెళ్లేందుకు మరి కొంత టైం పడుతుందని తెలుస్తోంది. మరి బోయపాటి ముందుగా సూర్య సినిమాకు ఓటేస్తాడా ? లేదా అఖండ 2 పనులు మొదలుపెట్టి త్వరలోనే అఖండ 2 సెట్స్ మీదకు తీసుకువెళ్తాడా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news