Movies"ఆ డైరెక్టర్ సంతోషం కోసమే ఆపరేషన్ చేయించుకోలేదు"..షాకింగ్ విషయాని బయట పెట్టిన...

“ఆ డైరెక్టర్ సంతోషం కోసమే ఆపరేషన్ చేయించుకోలేదు”..షాకింగ్ విషయాని బయట పెట్టిన పాయల్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా అందాలను ఎక్స్పోజ్ చేసే అందాల ముద్దుగుమ్మలు కొందరే ఉంటారు . వాళ్ళల్లో టాప్ ప్లేస్ లో ఉంటుంది పాయల్ . కెరియర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అన్ని బోల్డ్ రోల్సే చేస్తూ బోల్డ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన సినిమా మంగళవారం. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయి అభిమానులను బాగా ఆకట్టుకునింది.

ఆర్ఎక్స్ 100 కి మించిన బోల్డ్ నెస్ తో ఈ సినిమాలో పాయల్ కనిపించడం విశేషం. ఓవైపు రొమాన్స్ హర్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అజయ్ భూపతి కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలవబోతోంది అంటూ తెలుస్తుంది . ఈ క్రమంలోనే నవంబర్ 17న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా రీసెంట్గా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది .

“నిజానికి ఈ సినిమాలో నన్ను హీరోయిన్గా చేయమని అజయ్ అప్రోచ్ అయ్యే టైంకి నా పరిస్థితి అస్సలు బాగోలేదు . కిడ్నీ ఇన్ఫెక్షన్స్ తో చాలా చాలా బాధపడుతున్నాను .రెండు రోజుల్లో సర్జరీకి వెళ్లాలి అయితే ఆ టైంలో అజయ్ నాకు కథ చెప్పడంతో నాకు బాగా నచ్చింది.. సర్జరీ తర్వాత ఈ సినిమా షూట్ చేస్తే ఎక్కడ నేను ఆ పాత్రకి న్యాయం చేయలేను అన్న భయంతో డైరెక్టర్ నన్ను నమ్మి ఇంటికి వచ్చి నాకు ఈ కథ చెప్పినప్పుడు.. ఆయనను రెస్పెక్ట్ ఇస్తూ సర్జరీ క్యాన్సిల్ చేసుకుని మరి ఈ సినిమా చేశాను.. ఫైనల్లీ సినిమా చాలా బాగా వచ్చింది ..అజయ్ భూపతి చాలా చాలా హ్యాపీ ..నేను హ్యాపీ .. ఈ సినిమా మీ అందరికీ సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది . దీంతో పాయల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news