News' స్కంద ' 6 డేస్ క‌లెక్ష‌న్లు... రామ్ లాభాలు తెస్తాడా......

‘ స్కంద ‘ 6 డేస్ క‌లెక్ష‌న్లు… రామ్ లాభాలు తెస్తాడా… టెన్ష‌న్‌…!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీలీల హీరోయిన్ గా తెర‌కెక్కిన సినిమా స్కంద‌. యాక్ష‌న్ సినిమాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఈ వారాంతంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అఖండ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత బోయ‌పాటి డైరెక్ట్ చేసిన సినిమా కావ‌డంతో స్కంద‌పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా తాజాగా 6 రోజులు పూర్తి చేసుకుంది. రామ్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా తొలి రెండు రోజులు వ‌సూళ్ల ప‌రంగా దుమ్ము రేపింది. లేటెస్ట్‌గా 6 రోజులు పూర్తి చేసుకున్న సంద రెండు తెలుగు రాష్ట్రాల్లో రు. 23.68 కోట్ల షేర్ రాబ‌ట్టింది. 6వ రోజు ఈ సినిమాకు రు 1.08 కోట్ల షేర్ రాబ‌ట్టింది. 6వ రోజు ఏరియాల వారిగా స్కంద రాబ‌ట్టిన వ‌సూళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

నైజాం – 37 లక్షలు
సిడెడ్ – 18 లక్షలు
వైజాగ్ – 16 లక్షలు
తూర్పు – 10 లక్షలు
వెస్ట్ – 7 లక్షలు
కృష్ణ – 6 లక్షలు
గుంటూరు – 9 లక్షలు

నెల్లూరు – 5 లక్షలు

6 డేస్ షేర్ = 23.68 కోట్లు

మొత్తం 6 రోజుల్లో స్కంద 23.68 కోట్ల మార్క్ ట‌చ్ చేసింది. ఇది మంచి నెంబ‌రే అని చెప్పాలి. ఇక గ్రాస్ ప‌రంగా చూస్తే 6 రోజుల‌కు రు. 55 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. అయితే ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్ టార్గెట్ రు. 46 కోట్లు. రామ్ ఈ టార్గెట్ చేధిస్తాడా ? లేదా ? అన్న‌ది చూడాలి. థమన్ సంగీతం అందించగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news