Movies"రాసిపెట్టుకోండి.. 'దేవర' సినిమా బాహుబలికి అమ్మ మొగుడే"..ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్...

“రాసిపెట్టుకోండి.. ‘దేవర’ సినిమా బాహుబలికి అమ్మ మొగుడే”..ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్ చెప్పిన కొరటాల శివ(video)..!!

వావ్.. ఇది నిజంగా నందమూరి అభిమానులకు మంచి గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు ఎన్టీఆర్ దేవర సినిమా ఎలా ఉండబోతుంది..? ఎలాంటి ట్విస్టులు ఉంటాయి ..? అంటూ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేశారు. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ కొరటాల శివ కొద్దిసేపటి క్రితమే ఓ వీడియోని రిలీజ్ చేశారు .

ఈ వీడియోలో కోట్లాదిమంది అభిమానులు ఎగిరి గంతేసే అప్డేట్ కూడా ఇచ్చారు . ఎన్టీఆర్ దేవర సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కించబోతున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించారు . అంతేకాదు ఇప్పటివరకు మనం ఎన్టీఆర్ ని కని విని ఎరుగని లుక్స్ లో ఈ సినిమాలో చూడబోతున్నామట. అంతేనా ఎన్టీఆర్ ఈ సినిమాలో అభిమానుల కోసం ఓ స్పెషల్ సర్ప్రైస్ కూడా ఇవ్వబోతున్నాడు అంటూ కొరటాల శివ అనౌన్స్ చేశారు .

మరి ముఖ్యంగా ఈ సినిమాలోని పాత్రలు చాలా బాగా సెలెక్ట్ అయ్యాయి అని.. అందరినీ ఆకట్టుకుంటాయి అంటూ అభిమానులకు సినిమాపై హైప్ పెంచేశారు . మొత్తానికి ఓ బాహుబలి ..ఓ సల్లార్.. ఓ కే జి ఎఫ్ లాగా దేవర కూడా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుంది . దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ సంబర పడిపోతున్నారు . ఖచ్చితంగా బాహుబలి కి మించిన రికార్డ్స్ ఈ సినిమా క్రియేట్ చేస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ప్రజెంట్ కొరటాల మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news