Newsరణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకోక ముందు దీపిక పదుకొనే ఏకంగా ఇంతమందితో...

రణ్‌వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకోక ముందు దీపిక పదుకొనే ఏకంగా ఇంతమందితో ఎఫైర్ పెట్టుకుందా..?

బాలీవుడ్ తో పాటు అటు హాలీవుడ్ రెండిట్లోనూ నటిస్తూ సత్తా చాటుతుంది సౌత్ ఇండియన్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే. దీపికా పదుకొనే స్వస్థలం బెంగళూరు. ఆమె కన్నడ ఆడపడుచు. దీపిక తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రకాష్ పదుకొనే. దీపిక సినిమా లైఫ్ ఎంత హాట్ అవుతుందో ఆమె వ్యక్తిగత జీవితం కూడా అంతే హాట్ గా చర్చనీయాంశం అవుతుంది. దీపిక బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రణవీర్ తో పెళ్లికి ముందు ఆమె ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏడుగురుతో ఎఫైర్ పెట్టుకుని వార్తల్లోకి ఎక్కింది. దీపిక ఎఫైర్ పెట్టుకున్న ఆ వ్యక్తులు ఎవరో చూద్దాం.

నిహార్ పాండ్యా :


ముంబై వ్యాపారవేత్త నిహార్ పాండ్యాతో దీపిక ఎఫైర్ నడిపింది. వారిద్దరూ మూడు సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఆ తర్వాత నిహార్.. దీపికకు బ్రేకప్ చెప్పేసి సింగర్ నీతి మోహన్ ని పెళ్లాడాడు.

మహేంద్రసింగ్ ధోనీ – యువరాజ్ సింగ్ :


భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో కూడా దీపిక డేటింగ్ చేస్తుందన్న పుకార్లు బయటికి వచ్చాయి. ఆమె బహిరంగంగానే ధోని పట్ల తన అభిమానం వ్యక్తం చేసింది. యువరాజ్ సింగ్ ధోనీలతో దీపిక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపింది అన్న గుసగుసలు కూడా అప్పట్లో వినిపించాయి. యువరాజ్ సింగ్ మరో భారత స్టాక్ క్రికెటర్. యువరాజ్ సింగ్ తో కూడా దీపికకు రొమాంటిక్ కనెక్షన్ ఉండేదన్న ప్రచారం జరిగింది. వారి బీజీ షెడ్యూల్ చివరికి వారు విడిపోవడానికి దారితీసింది. ఆ తర్వాత యువరాజ్‌ ఇంటర్వ్యూలో తమ ఇద్దరి బ్రేకప్ గురించి కూడా మాట్లాడాడు.

ఉపేన్ పటేల్ :


దీపిక మోడల్ యాక్టర్ ఉపేంద్ర పటేల్ మధ్య చాలా సార్లు ఫోటోషూట్లు జరిగాయి. ఈ ఫోటో షూట్ల నేపథ్యంలో వారిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడిచింది అన్న పుకార్లు గట్టిగా వినిపించాయి. అత‌డు ఎవరో కాదు.. విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమాలో విలన్‌గా నటించాడు.

ముజామిల్ ఇబ్రహీం :


కాశ్మీర్ మోడల్ యాక్టర్ ముజామిల్ ఇబ్రహీం.. దీపిక మధ్య సంథింగ్ సంథింగ్ నడిచింది. 2007లో ఇబ్రహీం ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గత సంబంధాల గురించి దీపికతో తనకున్న అనుబంధం గురించి నిజాయితీగా చర్చించాడు. దీపిక ప్రధాన పాత్ర పోషించిన ఏ జవానీ హై దివానీ సినిమాలో ఇబ్రహీం కీలక పాత్రలో నటించాల్సిన ఆఫర్ వస్తే తిరస్కరించాడు.

సిద్ధార్థ మాల్యా :


ప్రముఖ వ్యాపారవేత్త విజయమాల్య తనయుడు సిద్ధార్థ మాల్యా దీపిక మధ్య డేటింగ్ నడిచింది అన్న పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న టైంలో వారి ముద్దు సన్నివేశం బాగా హైలైట్ అయింది. కెరీర్ స్టార్టింగ్‌లో దీపిక సిద్థార్థ్ మాల్యాతో డేటింగ్ చేసింది.

రణ్‌వీర్ కపూర్ :


బాలీవుడ్ లో యంగ్ క్రేజీ హీరో రణబీర్ కపూర్ దీపిక గాఢంగా ప్రేమించుకున్నారు. అతనిపై తనకున్న ప్రేమకు చిహ్నంగా దీపిక మెడపై పచ్చబొట్టు కూడా వేయించుకుంది. రెండు సంవత్సరాలు పాటు డేటింగ్ చేశాక.. 2009లో వారిద్దరు విడిపోయారు. ఇలా ఏడుగురితో ప్రేమయుణాలు నడిపిన దీపిక చివరకు రన్వీర్ సింగ్ ని తన భర్తగా చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news