Newsనంద్యాల టౌన్‌లో బాలయ్య నెవర్ బిఫోర్ ఎవ్వ‌ర్ ఆఫ్టర్ రికార్డ్.. నట‌సింహం...

నంద్యాల టౌన్‌లో బాలయ్య నెవర్ బిఫోర్ ఎవ్వ‌ర్ ఆఫ్టర్ రికార్డ్.. నట‌సింహం ఎప్పటికీ సీడెడ్ కింగే..!

నందమూరి బాలకృష్ణను టాలీవుడ్‌లో సీడెడ్‌కింగ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. బాలయ్య ప్లాప్ సినిమాలకు కూడా సీడెడ్‌లో విపరీతంగా కలెక్షన్లు వస్తూ ఉంటాయి. బాలయ్య నటించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు సీడెడ్‌లో యేడాదికిపైగా ఆడాయి. లెజెండ్ సినిమా అయితే ఇదే సీడెడ్‌లోని ఎమ్మిగనూరులో ఏకంగా 400 రోజులకు పైగా ఆడింది. ప్రొద్దుటూరులోనూ లెజెండ్ 400 రోజులు ఆడింది. ప్రొద్దుటూరులో అయితే 1000 రోజులు దాటేసింది.

ఇక శాతకర్ణి వంద రోజులు దాటేసింది. అఖండ సినిమా ఆంధ్రాలో మొత్తం నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడితే గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మినహా ఒక కర్నూలు జిల్లాలోనే మూడు కేంద్రాలలో డైరెక్ట్ గా వంద రోజులు పూర్తి చేసుకుంది. దీనిని బట్టి సీడెడ్‌లో బాలకృష్ణకు ఎంత పట్టు ఉందో తెలుస్తోంది. అలాగే వీరసింహారెడ్డి సినిమా కూడా సీడెడ్‌లో వంద రోజులు ఆడింది.

సీడెడ్‌లో కొన్ని జిల్లాల్లో బాలయ్య సినిమాలు చాలా సులువుగా రికార్డులు బ్రేక్ చేస్తూ ఉంటాయి. చాలా కేంద్రాలలో బాలయ్యకు ఇక్కడ వంద రోజులు సినిమాలు ఉన్నాయి. తాజాగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా నంద్యాల టౌన్ లో నెవర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్టర్ రికార్డు నమోదు చేసింది. నంద్యాల టౌన్ లో ఎనిమిది రోజులకు గాను భగవంత్ కేసరి రూ.50 లక్షలకు పైగా గ్రాస్ వ‌సూళ్ళు కొల్లగొట్టింది. 10 రోజులకు రూ.55 లక్షలకు పైగా గ్రాస్ వచ్చింది.

నంద్యాల టౌన్ లో బాలయ్య నటించిన చివరి మూడు సినిమాలు అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు కూడా రూ.50 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించాయి. ఇక్కడ మూడు వరుస సినిమాలతో రూ.50 లక్షల వసూళ్ళు కొల్లగొట్టిన ఏకైక టాలీవుడ్ హీరోగా బాలయ్య అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఏది ఏమైనా బాలయ్య మరోసారి సీడెడ్ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news