News80 ఏళ్ల కెరీర్‌లో రమ్యకృష్ణ అన్ని కోట్ల ఆస్తులు కూడ‌బెట్టిందా... ఒక్క...

80 ఏళ్ల కెరీర్‌లో రమ్యకృష్ణ అన్ని కోట్ల ఆస్తులు కూడ‌బెట్టిందా… ఒక్క రోజు కాల్షీట్ రేటు తెలుసా…!

దాదాపు మూడున్నర దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమల్లో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ.. తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించింది.. విలక్షణ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లిి చేసుకుని ఒక బాబు పుట్టాక సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది.

అలాంటి రమ్యకృష్ణ దాదాపు మూడున్నర దశాబ్దాలుగా హీరోయిన్‌గా చేస్తూ ఎన్ని కోట్ల ఆస్తి కూడా పెట్టిందనే విషయం ఇక్కడ తెలుసుకుందాం. రమ్యకృష్ణ కేవలం హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్స్, అలాగే నరసింహ, నీలాంబరి వంటి సినిమాల్లో నెగిటివ్ పాత్రలో కూడా నటించి తన నటనతో అందరిని మెప్పించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అమ్మ, అత్త వంటి పాత్రలో నటిస్తూ ముందుకు దూసుకుపోతుంది.

అంతేకాకుండా రమ్యకృష్ణ బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో శివగామి పాత్రలో నటించి భారీ క్రేజ్ అందుకుంది. ఈ సినిమాతో రమ్యకృష్ణ క్రేజ్ ఎవరు ఊహించిన విధంగా పెరిగింది. ఆ తర్వాత జైలర్ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కీ రోల్ పోషించిన ఈమె ఈ సినిమా కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం.

అలాంటి రమ్యకృష్ణ ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ భాషలో 100కు పైనే సినిమాలో నటించింది. ఈ హీరోయిన్ ఆస్తి దాదాపు రూ.100 కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె భర్త కృష్ణవంశీ కూడా చాలానే ఆస్తిపాస్తులు సంపాదించారు. ప్రస్తుతం రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రోజుకు రూ.10 లక్షలకు పైగా రెమ్యూనిరేషన్ తీసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news