Newsర‌ష్మిక‌ను మ‌ర్చిపోలేక‌పోతోన్న మాజీ ప్రియుడు... గుండెల్లో ఇంత బాధ‌...!

ర‌ష్మిక‌ను మ‌ర్చిపోలేక‌పోతోన్న మాజీ ప్రియుడు… గుండెల్లో ఇంత బాధ‌…!

కన్నడ హీరో రక్షిత్ శెట్టి – క్రేజీ హీరోయిన్ రష్మిక కేరీర్‌ ప్రారంభంలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. మాటలు, చర్చ‌లు కూడా జరిగిపోయాయి. ఇంతలోనే రష్మిక టాలీవుడ్ పాపులర్ హీరోయిన్‌ అయింది. అదే టైంలో రక్షిత్‌తో తన పెళ్లిని రద్దు చేసుకుంది. వీరి పెళ్లి క్యాన్సిల్ వెనక ఏం జరిగింది ? అనేది బయట ప్రపంచానికి తెలియదు. పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న తర్వాత రక్షిత్ – రష్మిక మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంది ? అసలు రక్షిత్ ఆ బాధ నుంచి బయటపడ్డాడా ? అన్నదానిపై రక్షిత్‌ అప్పుడప్పుడు స్పందిస్తున్నాడు.

తాజాగా మరోసారి ఇదే అంశంపై రక్షిత్ స్పందించాడు. ఓ వ్యక్తిని అదే పనిగా ద్వేషించడం సరికాదని.. దానివల్ల మనసులో మరింత భారం పెరుగుతుందని చెప్పాడు. మనకు నచ్చలేదని ఎదుటి వ్యక్తిని ద్వేషించడం సరికాదు.. ప్రతి ఒక్కరికి ఓ వ్యక్తిత్వం ఉంటుంది.. దాన్ని మనం గౌరవించాలి.. అభిప్రాయాలు కలవనంత మాత్రాన ద్వేషించాల్సిన అవసరం లేదు. మనసులు కలవనప్పుడు వదిలివేయాలి.. జీవితంలో ముందుకు సాగిపోవాలి తప్ప ఆ బాధను మోస్తూ ఉండకూడదు.. అది మనకు మరింత భారంగా మారుతుందని చెప్పాడు.

అలాగే ర‌ష్మిక‌తో బ్రేకప్ బాధ నుంచి బయటపడటం అంత ఈజీ కాదు అని కూడా చెప్పుకొచ్చాడు. మనసుకు తగిలిన గాయాన్ని, ఆ భారాన్ని మరిచిపోవడం చాలా కష్టం.. కానీ సరైన పద్ధతిలో అర్థం చేసుకుంటే ఆ భారాన్ని వదిలించుకోవడం తేలిక అని రక్షిత్ తెలిపాడు. ఇక ప్రస్తుతం రష్మికతో తాను ఫ్రెండ్లీ గానే ఉన్నానని.. తమ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒకరికొకరు ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటామ‌న్నాడు.

పుట్టినరోజులు వచ్చినప్పుడు శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటాం.. అలా ఇద్దరం టచ్ లోనే ఉన్నామంటున్నాడు. రక్షిత్తో బ్రేకప్ విషయంలో రష్మికపై ఎప్పుడు భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు అయినా ఆ ట్రోలింగ్ కాస్త తగ్గుతుందేమో చూడాలి. ఏది ఏమైనా రష్మికతో బ్రేకప్ అనేది తన మనసుకు తగిలిన గాయంగా రక్షిత్‌ చెప్పటానికి బట్టి చూస్తే అతడు ఎంత బాధపడ్డాడో క్లియర్ గా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news