Newsబ్లాక్‌బ‌స్ట‌ర్ R R R సీక్వెల్ R R R 2...

బ్లాక్‌బ‌స్ట‌ర్ R R R సీక్వెల్ R R R 2 ప‌క్కా… టైం కూడా చెప్పేశాడుగా…!

పాన్ ఇండియా బ్లాక్బ‌స్ట‌ర్ త్రిబుల్ ఆర్ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఇప్పటికే రచయిత విజయేంద్రప్రసాద్ ప్రకటించారు. భారతదేశ సినిమాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటి చెప్పిన సినిమా త్రిబుల్ ఆర్. టాలీవుడ్లో ఇద్దరు క్రేజీ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తరకెక్కించిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా అందుకుంది.

ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని క్లూ ఇచ్చిన ఈ సీక్వెల్ ఎప్పుడు ? స్టార్ట్ అవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న విషయాలపై క్లారిటీ లేదు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసే సినిమాపై ఫుల్ బిజీగా ఉన్నారు. మహేష్ తో చేసే సినిమా పూర్తయ్యాక రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా సీక్వెల్ తీస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది.

దీనిపై ఈ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కించే సినిమా తర్వాతే త్రిబుల్ ఆర్ సినిమా సీక్వెల్ ఉంటుందని చెప్పడంతో ఒక్కసారిగా సెన్షేష‌న‌ల్ టాపిక్ అయింది. ఆస్కార్ అవార్డును త్రిబుల్ ఆర్ సాఆకారం చేసింది కాబట్టి త్రిబుల్ ఆర్ సినిమా సీక్వెల్ కి ప్రపంచ వ్యాప్తంగా బజ్‌ ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news