Newsవిజ‌య్ దేవ‌ర‌కొండ‌ - రామ్ అనుష్క‌ను తెగ‌ న‌లిపేస్తున్నారుగా...!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ – రామ్ అనుష్క‌ను తెగ‌ న‌లిపేస్తున్నారుగా…!

స్వీటీ బ్యూటీ అనుష్క టాలీవుడ్ లో ఏకంగా 18 సంవత్సరాలుగా కెరియర్ కంటిన్యూ చేస్తూ వస్తుంది. ఎప్పుడో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయం అయింది. ఇన్నేళ్ల కెరీర్ లో ఆమె టాలీవుడ్ లో ఎందరో స్టార్ హీరోలతో నటించి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఇంకా చెప్పాలంటే పాన్ వరల్డ్ సినిమాలు బాహుబలి సీరిస్‌ సినిమాలతో ఆమె ఎంత పాపులర్ అయిందో చెప్పక్కర్లేదు.

అయితే ఇటీవల అనుష్క చాలా గ్యాప్ తీసేసుకుంది. అనుష్క సినిమా వచ్చి మూడేళ్లు అవుతోంది. ఆమె కుర్ర హీరో నవీన్ పోలిశెట్టికి జోడిగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సెప్టెంబర్ 7న థియేటర్లలోకి దిగుతుంది. ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదాలు పడిన ఈ సినిమా ఈ డేట్ కు కచ్చితంగా రిలీజ్ అయ్యేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ముందు వారం.. తర్వాత వారం కూడా టాలీవుడ్ క్రేజీ హీరోలు నటించిన రెండు క్రేజీ ప్రాజెక్టులు థియేటర్లలోకి దిగుతున్నాయి.

ఈ రెండు సినిమాల మధ్యలో అనుష్క సినిమా ఖచ్చితంగా ఛాన్సులే కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ ఒకటిన విజయ్ దేవరకొండ, సమంత హీరోయిన్గా నటించిన ఖుషి మూవీ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ట్రైలర్ కూడా బాగా క్లిక్ అయింది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాకు ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమా క్లిక్ అయితే ఆ మరుసటి వారం వస్తున్న‌ అనుష్క సినిమాకు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకకపోవచ్చు.

ఇక అనుష్క సినిమా రిలీజ్ అయిన మరుసటి వారం సెప్టెంబర్ 15న రామ్ – శ్రీలీలా జంటగా బోయపాటి తెరకెక్కించిన స్కంధ‌ సినిమా వస్తోంది. పైగా అఖండ తర్వాత బోయపాటి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఇటు శ్రీలీల హీరోయిన్ కావడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలలో భారీ బెట్టింగ్ జరుగుతుంది. ఈ క్రమంలోనే స్కంధ‌ వచ్చే టైంకు అనుష్క ఆడుతున్న సినిమాకు సరైన టాక్ ఉన్నా లేకపోయినా ఎక్కువ థియేటర్లు కోల్పోయే అవకాశాలే కనిపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఇద్దరు కుర్ర హీరోల క్రేజీ సినిమాల మధ్యలో అనుష్క సినిమా నలిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సెప్టెంబర్ 28న ప్రభాస్ సలార్ మూవీ వస్తోంది. ఈ లెక్కన చూస్తే అనుష్క సినిమా సెప్టెంబరు 7న అయిన రిలీజ్ అవుతుందా ? లేదా మరోసారి వాయిదా వేస్తారా ? అన్న డైల‌మా అయితే కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news