Moviesఖుషి మూవీకి విజ‌య్‌-స‌మంత రెమ్యున‌రేష‌న్లు ఇవే… గ‌ట్టిగానే పిండేశారు..!

ఖుషి మూవీకి విజ‌య్‌-స‌మంత రెమ్యున‌రేష‌న్లు ఇవే… గ‌ట్టిగానే పిండేశారు..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్‌ సమంత కాంబినేషన్లో తెర‌కెక్కిన సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యి సినిమాపై మంచి హైప్‌ తెచ్చి పెట్టాయి. ఇక ఖుషి సినిమా ట్రైలర్ చూసిన వాళ్లంతా కూడా సినిమా కచ్చితంగా సూపర్ హిట్ కొట్టబోతుందని ఫుల్ కాన్ఫిడెంట్ తో ఉన్నారు.

ఇక లైగ‌ర్ లాంటి పాన్ ఇండియా డిజాస్ట‌ర్ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తోన్న సినిమా ఇదే కావ‌డంతో విజ‌య్ అభిమానులు కూడా ఖుషి సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం విజ‌య్ తో పాటు హీరోయిన్ స‌మంత కూడా గ‌ట్టిగానే రెమ్యున‌రేష‌న్లు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

లైగ‌ర్.. అంత‌కు ముందు విజ‌య్ ఒక్కో సినిమాకు రు. 20 – 22 కోట్ల రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. లైగ‌ర్, వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాలు పెద్ద డిజాస్ట‌ర్లు అవ్వ‌డంతో విజయ్ కాస్త డౌన్ అయిన‌ట్టు క‌నిపించినా.. విజ‌య్‌కు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో ఇప్పుడు ఖుషికి అత‌డి పాత రెమ్యున‌రేష‌న్ కంటే కాస్త ఎక్కువ‌గానే రు. 25 కోట్లు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఇది కాస్త ఎక్కువే అయినా సినిమా క్రేజ్‌ను బట్టి నిర్మాత‌లు ఇంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చి ఉండొచ్చ‌ని టాక్ ? ఇక స‌మంత‌కు కూడా రు. 5 కోట్లు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అంటే హీరో, హీరోయిన్ల రెమ్యున‌రేష‌న్ల‌కే రు. 30 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. ఏదేమైనా సామ్‌, విజ‌య్ రెమ్యున‌రేష‌న్లు గ‌ట్టిగానే వ‌సూలు చేశార‌ని ఇండ‌స్ట్రీ గుస‌గుస‌..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news