Newsఅన్ని కలిసొచ్చుంటే ఆ హీరోయిన్ మెగా హీరో భార్య అయ్యేదా..? ఇప్పుడు...

అన్ని కలిసొచ్చుంటే ఆ హీరోయిన్ మెగా హీరో భార్య అయ్యేదా..? ఇప్పుడు పరిస్ధితి ఎంత దారుణంగా ఉందంటే..?

సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అది మంచి కాదు చెడు కాదు మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయం అంటే జనాలు తెలుసుకోవడానికి ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . అందుకే మెగా ఫ్యామిలీ పై రకరకాల గాసిప్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి . కాగా మెగా ఫ్యామిలీ ట్యాగ్ ఉపయోగించుకొని సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్ గురించి గతంలో ఓ న్యూస్ ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయిందో అందరికీ తెలిసిన విషయమే .

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న రెజీనాతో ప్రేమాయణం నడిపారు అని ..వాళ్ళు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది . దానికి కారణం వాళ్ళిద్దరి కాంబోలో వచ్చ్గిన సినిమాలో నటించిన సీన్ లు. వాళ్ళిద్దరూ సినిమాల్లో హిట్ పెయిర్ గా నిలవడమే కాకుండా.. బయట కూడా అలాగే తిరిగారు.

అంతేకాదు తెరపై వీళ్ళకి కెమిస్ట్రీ కూడా సూపర్ గా అనిపించింది. అందుకే వీళ్ళ జంట నిజంగానే ప్రేమించుకుంటున్నారు అంటూ ప్రచారం జరిగింది . అయితే మెగా ఫ్యామిలీ ఇంటికి కోడలు అవ్వాలి అంటే సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలి అన్న క్రేజీ కండిషన్ పెట్టాడట సాయిధరమ్ తేజ్ . ఈ క్రమంలోనే మొదటి నుంచి సినిమాలు అంటే ప్రాణం గల రెజీనా.. ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసి మెగా ఇంటి కోడలు అయ్యే ఛాన్స్ కూడా మిస్ చేసుకుందట . దీంతో ఈ న్యూస్ అప్పట్లో వైరల్ గా మారింది. ఆ తర్వాత రెజీనా – సాయిధరమ్ తేజ్ దూరం దూరంగానే ఉంటున్నారట . త్వరలోనే సాయిధరమ్ తేజ్ పెళ్లి శుభవార్త చెప్పబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . చూద్దాం మరి ఆయన ఎవరి పేరుని తెరపైకి తీసుకొస్తారో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news