Newsహీరోయిన్ భూమిక‌ న‌డుము ర‌హ‌స్యం తెలుసా...!

హీరోయిన్ భూమిక‌ న‌డుము ర‌హ‌స్యం తెలుసా…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జె సూర్య దర్శకత్వంలో తరకెక్కిన సినిమా ఖుషి. 2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఖుషి అప్పట్లో పెద్ద హిట్ అయింది. ఈ సినిమా ఆరోజుల్లోనే ఏకంగా 79 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ – భూమిక మధ్య వచ్చే సీన్లు యూత్ ను పిచ్చెక్కించాయి. వీరిద్దరి మధ్య గొడవలు.. రొమాంటిక్ సన్నివేశాలు అభిమానులను ఎంత ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఖుషి సినిమా పేరు వినిపించగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది భూమిక నడుము సీను. అయితే ఈ నడుము సన్నివేశం వెనక ఓ సీక్రెట్ తాగే ఉంది. నువ్వు ఏం చేస్తావో ? తెలియదు గానీ ఈ సీన్ షూట్ చేసే టైంలో నీ నడుము చాలా షైనింగ్ గా కనిపించాలి.. అసలు నడుము చూస్తే తళ తళ‌ మెరిసిపోవాలని డైరెక్టర్ సూర్య భూమికకు సూచనలు చేశారంట. దీంతో భూమిక ఒక ప్రత్యేకమైన సోప్ తో నడుముని చాలాసేపు వాష్ చేసిందట.

అలా డైరెక్టర్ ఆ సీన్‌ షూట్ చేసే టైంకి భూమికి నడుము తల తళ త‌ళ‌ మెరిసిపోయిందట. అయితే భూమిక నడుము సీక్రెట్ పియర్స్ సోప్ అని చాలామంది అప్పట్లో తెగ చర్చించుకునేవారు. అప్పటికే తెలుగులో అక్కినేని మేనల్లుడు సుమంత్ హీరోగా యువకుడు సినిమాలో నటించిన భూమికకు ఖుషి రెండవ సినిమా. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక అసలు చాలా ఏళ్లపాటు భూమిక టాలీవుడ్లో వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా దూసుకుపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news