Moviesస్టార్ హీరోల పై తమన్నా షాకింగ్ కామెంట్స్.. ఎన్టీఆర్ ఒక్కరే నెం...

స్టార్ హీరోల పై తమన్నా షాకింగ్ కామెంట్స్.. ఎన్టీఆర్ ఒక్కరే నెం 1.. !!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రసెంట్ ఎలాంటి సినిమాలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా బాలీవుడ్ లో రెండు వెబ్ సిరీస్ చేసి ఇండస్ట్రీని షేక్ చేసిన తమన్నా ఇప్పుడు రజనీకాంత్ సరసన జైలర్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఆగస్టు 10న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఇలాంటి క్రమంలోనే కోలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్న మాట్లాడుతూ .. పలు సంచలన విషయాలను బయటపెట్టింది .

ఇలాంటి క్రమంలోనే తెలుగు హీరోలలో తన ఫేవరెట్ హీరో ఎవరు అని..? నచ్చే క్వాలిటీస్ ఏంటి ..? అని ఏమాత్రం భయపడకుండా.. ఉన్న విషయాన్ని ఉన్నట్టు క్లారిటీగా చెప్పేసింది . ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెబుతూ “ఆయన యూనిక్ స్టార్.. ఆయనను ప్రేమించిన వారు ఉండరు” అంటూ తనపై అభిమానాన్ని చాటుకునింది.

“ఇక పవర్ స్టార్ గురించి చెబుతూ వెరీ మాస్ అండ్ స్టైలిష్ పర్సన్ అని కామెంట్ చేసింది. ప్రభాస్ ప్రతి ఒక్కరి డార్లింగ్ , మహేష్ బాబు గుడ్ లుకింగ్ గ్లామర్ హీరో.. జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్.. డాన్స్ – ఫైట్స్ – నటన అన్ని బాగా చేస్తారు . అల్లు అర్జున్ -స్టైలిష్ స్టార్ మంచి డాన్సర్.. తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా.. రామ్ చరణ్ రాయల్ పర్సన్” అంటూ మిల్కీ బ్యూటీ ఇలా టాప్ హీరోల గురించి సింపుల్గా ఒక్క మాటలో చెప్పుకొచ్చేసింది. ప్రస్తుతం తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే అందరి హీరోలకి ఒకటి లేదా రెండు క్వాలిటీస్ చెప్తూ వచ్చిన తమన్నా ఎన్టీఆర్ కి మాత్రమే ఆల్ రౌండర్ అని పరోక్షంగా చెప్పకుండానే ఇండస్ట్రీలో టాప్ హీరో నెంబర్ వన్ హీరో ఎన్టీఆర్ అంటూ చెప్పేసింది తమన్నా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news