Moviesకొంప ముంచేసిన సమంత కొత్త కోరిక.. లాస్ట్ మినిట్ లో...

కొంప ముంచేసిన సమంత కొత్త కోరిక.. లాస్ట్ మినిట్ లో అమెరికా ప్రయాణం క్యాన్సిల్ ..!?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ సమంత మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి కారణంగా బాధపడుతున్న సంగతి తెలిసిందే. కాగ సుదీర్ఘంగా ఎనిమిది నెలల పాటు ఈ వ్యాధితో పోరాడిన సమంత ఆ వ్యాధిని నయం చేసుకొని మళ్లీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ముందుకు వెళ్ళడానికి సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న “ఖుషి” సినిమాలో హీరోయిన్గా తన పాత్రను కంప్లీట్ చేసుకున్న సమంత.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడిల్ వెబ్ సిరీస్ ని కూడా కంప్లీట్ చేసింది .

అయితే సమంతకి మళ్ళీ మయోసైటిస్ వ్యాధి తిరగబడటంతో..టీట్ మెంట్ కోసం అమెరికా వెళుతుంది అంటూ ప్రచారం జరిగింది. అయితే సమంత పి ఆర్ టీం కూడా దీన్ని కన్ఫామ్ చేసింది. సమంత కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ చెప్పబోతుంది అంటూ క్లారిటీ ఇచ్చింది . అయితే రేపో మాపో సమంత అమెరికా ఫ్లైట్ ప్రయాణం ఉండగా సడన్గా బిగ్ ట్వీస్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది . చివరి నిమిషంలో సమంత తన అమెరికా ప్రోగ్రాంని క్యాన్సిల్ చేసుకుందట . దానికి కారణం ఆమె చిరకాల కోరిక అని తెలుస్తుంది.

ఎప్పటినుంచో సమంతకి రోడ్డు ట్రిప్ చేయాలని ఎంతో ఆశగా ఉండేదట . అయితే సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు అంత డబ్బులు లేక ఆ కోరికను అలాగే పెట్టుకుంటే.. ఆ తర్వాత హీరోయిన్ గా మారాక అంత టైం లేక ఆ కోరికను అలాగే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చిందట. ఫైనల్లీ ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత ఆమెకు ఆ టైం దొరికింది. అందుకే పెద్ద రోడ్ ట్రిప్ ప్లాన్ వేశారట సమంత. ప్రస్తుతం సమంత తమిళనాడులో ఉన్న దేవాలయాలను సందర్శిస్తుంది. ఈ రోడ్ ట్రిప్ కూడా పూర్తయ్యాక సమంత అమెరికా వెళ్లి చికిత్స తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు జనాలు . దీంతో సమంత కు సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news