Newsమెగా హీరో వరుణ్ సినిమాలో బాలీవుడ్ సెక్సీ బాంబ్.. ఇక తెలుగు...

మెగా హీరో వరుణ్ సినిమాలో బాలీవుడ్ సెక్సీ బాంబ్.. ఇక తెలుగు కుర్రాళ్లను ఆపలేం రా బాబోయ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ట్యాగ్ తగిలించుకొని ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ వాళ్ళ అందరిలోకి ప్రత్యేకంగా నిలుస్తారు . మెగా ట్యాగ్ ఉపయోగించుకుని సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన వరుణ్ తేజ్ ఎక్కడా కూడా తన తండ్రి తన పెదనాన్న తన బాబాయ్ పేరుని ఉపయోగించుకొని ఆఫర్లు దక్కించుకోలేదు . ప్రతి సినిమాకి తానే స్వయంగా కష్టపడి ప్రతి ఒక్క కథలో సరికొత్తగా నటిస్తూ తెరపై క్లియర్గా చూపించి మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్నారు .

ఇప్పటివరకు వరుణ్ తేజ్ నటించిన సినిమాలు చూస్తే ఒక సినిమాలో నటించిన పాత్ర మరో సినిమాలో నటించకుండా జాగ్రత్త పడ్డాడు . గాండివధాఐ అర్జున సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీగా ఉన్న వరుణ్ తేజ్ రీసెంట్గా మరో సినిమాని సెట్స్ పైకి తీసుకొచ్చాడు . పలస డైరెక్టర్ కరుణ్ కుమార్ తో “మట్క” అనే సినిమాను అనౌన్స్ చేశాడు మెగా హీరో వరుణ్ తేజ్ .

మెగా ప్రిన్స్ కెరియర్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం గా రాబోతున్న ఈ మూవీలో అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ సెక్సీ బాంబ్ నూరా ఫతేహి..కీలక పాత్రలో కనిపించబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు ఐటెం సాంగ్స్ చేసిన ఈ బ్యూటీ తెలుగులోఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది. అంతేకాదు ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేయిస్తున్నారట మేకర్స్. ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ త్వరలోనే అఫిషియల్ గా ప్రకటించబోతున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news