Moviesసోషల్ మీడియాని షేక్ చేస్తున్న చిరంజీవి కూతురి కామెంట్స్.. సుస్మిత కూడా...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న చిరంజీవి కూతురి కామెంట్స్.. సుస్మిత కూడా మొదలుపెట్టేసిందా..?

సోషల్ మీడియాలో ఎంత పాజిటివిటీ ఉంటుందో అంతకు డబుల్ రేంజ్ లో నెగెటివిటీ ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఇది అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళే స్టార్స్ గా మారతారు. అయితే కొన్ని కొన్ని సార్లు మరి దారుణ రేంజ్ లో కామెంట్స్ వినిపించడంతో స్టార్ సెలబ్రెటీస్ కూడా బాధపడిన సందర్భాలు ఉన్నాయి . అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఉన్న చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సైతం అలాంటి కామెంట్స్ విని బాధపడిందట ఏడ్చిందట .

ఆ తర్వాత ఇలా ఏడుస్తూ కూర్చుంటే పనులు జరుగవు అంటూ ముందుకెళ్ళిపోయిందట . ఈ విషయాన్ని స్వయాన చిరంజీవి కూతురు సుస్మిత నే చెప్పుకొచ్చారు. మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి ప్రొడ్యూసర్గా కాస్ట్యూమ్ డిజైనర్గా ఎంట్రీ ఇచ్చింది సుస్మిత. రంగస్థలం – సైరా లాంటి చిత్రాలకు సుస్మిత కాస్టింగ్ డిజైనర్గా వ్యవహరించారు. త్వరలోనే తండ్రి చిరంజీవి తో ఓ సినిమా నిర్మించేందుకు రెడీ అవుతుంది .

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం ఆగస్టు 22 న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా లాంచ్ కాబోతుంది. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. “ఇండస్ట్రీలో నెపోటిజం ఉందని నన్ను టార్గెట్ చేశారని ..దారుణమైన కామెంట్స్ చేశారని ..ఆ కామెంట్స్ వల్ల నేను బాధపడ్డాను అని ..అయితే అలా పట్టించుకుంటూ కూర్చుంటే లైఫ్ లో ముందుకెళ్ళలేము అని రియలైజ్ అయ్యానని” చెప్పుకొచ్చింది . దీంతో సుస్మిత సుస్మిత కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆఖరికి సుస్మిత కూడా సినీ ప్రమోషన్స్ కోసం ఇలా పాత విషయాలను బయటపెట్టేస్తుందే అంటూ షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news