Newsవిజయ్ వర్మ అలా చేయడం వల్లే..తమన్నా ఫుల్ గా టెంప్ట్ అయ్యి...

విజయ్ వర్మ అలా చేయడం వల్లే..తమన్నా ఫుల్ గా టెంప్ట్ అయ్యి పడిపోయిందా..?

గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా – విజయ్ వర్మల ప్రేమాయణం ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనందరికీ బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు ..డేటింగ్ లో ఉన్నారు అన్న వార్తలు వినిపిస్తున్నా సరే ..ఈ జంట ఏమాత్రం ఓపెన్ అప్ అవ్వలేదు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం తమన్న తన ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ” నేను విజయవర్మతో డేటింగ్ లో ఉన్న వార్త నిజమే” అంటూ లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది .

ఈ క్రమంలోనే తమన్న – విజయ్ ప్రేమాయణం అఫీషియల్ అయిపోయింది . త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . కాగా తమన్నా ఎంతోమంది హీరోలతో నటించింది . కానీ ఎందుకు విజయవర్మని ప్రేమించింది ..? ఆయనతోనే డేటింగ్ చేస్తుంది ..? అన్న వార్త హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అయితే విజయ్ వర్మ చాలా మంచి వ్యక్తిఅని ..తమన్నాని చాలా బాగా చూసుకుంటాడని ..అంతే కాదు తనకు హెల్ప్ గా రక్షణగా నిలిచి ఉంటాడని .. మిగతా హీరోలతో వర్క్ చేసినప్పుడు అలాంటి ఫీలింగ్ కలగలేదని ..కానీ విజయవర్మతో చేస్తున్నప్పుడు ఆమెకు ఆ ఫీలింగ్ కలిగిందని ..చెప్పుకొస్తున్నారు.

అంతేకాకుండా ఆయన ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారని ..ఆ విధంగా విజయవర్మ అంటే తమన్నాకి ఇంత పిచ్చి ఏర్పడిందని.. చెప్పుకొస్తున్నారు . అంతేకాదు తమన్నా సైతం ఓపెన్ గానే ఈ విషయాని కన్ ఫామ్ చెసింది. విజయ్ వర్మ అంటే తనకు ఎంతో ఇష్టమని .. ఆయన లేకుండా ఈమె బ్రతకలేదు అని ..ఈ క్రమంలోనే తమన్న విజయ్ ని ప్రేమించడానికి మెయిన్ రీజన్ ఆయనలో ఉన్న మంచితనమే అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news