News"గుంటూరు కారం" నుంచి శ్రీ లీల ఫస్ట్ లుక్ రిలీజ్.. త్రివిక్రమ్...

“గుంటూరు కారం” నుంచి శ్రీ లీల ఫస్ట్ లుక్ రిలీజ్.. త్రివిక్రమ్ డిట్టో ఆ సినిమా నుండి కాపీ కొట్టేసాడే..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న మహేష్ బాబు లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే మరియు టాలీవుడ్ లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల నటిస్తున్నారు . ఈ క్రమంలోనే ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా శ్రీలీలకు సంబంధించిన గుంటూరు కారం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రెడిషనల్ బట్టల్లో చాలా అందంగా తయారైంది శ్రీలీల. లంగా ఓణీలో అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరికి గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు – మహేష్ బాబు కాంబోలో వచ్చిన “అతడు” సినిమానే గుర్తొస్తుంది . ఆ సినిమాలో త్రిష లుక్స్ కూడా ఆస్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటాయి . అదే విధంగా గుంటూరు కారం సినిమాలో శ్రీలల ను ఆయిన తయారు చేసిన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు మొత్తం “అతడు” సినిమా స్టోరీ నే మళ్లీ తెరకెక్కించబోతున్నాడు అన్న డౌట్లు మొదలయ్యాయి. అంతేకాదు శ్రీ లీల లుక్ త్రిష లుక్ కంపేర్ చేస్తూ త్రిష కన్నా శ్రీలీలానే ట్రెడిషనల్ బట్టల్లో చాలా బాగా ఆకట్టుకుంటుంది అంటూ ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో గుంటూరు కారం హ్యాష్ ట్యాగ్స్ మళ్లీ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. మొత్తానికి మళ్ళీ మహేశ్ ఖాతాలో అతడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని వేయబోతున్నాడు త్రివిక్రమ్ అని ఈ పోస్టర్ చూస్తేనే అర్ధమైపోతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news