Moviesపుట్టిన రోజు నాడే కొంప ముంచేసిన కాజల్.. అభిమానులకు ఊహించని షాక్...

పుట్టిన రోజు నాడే కొంప ముంచేసిన కాజల్.. అభిమానులకు ఊహించని షాక్ ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది అందాల ముద్దుగుమ్మలు ఉన్న టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ అంటే అందరికీ అదోరకమైన తెలియని ఇష్టం ఏర్పడుతుంది . లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయినా కాజల్ అగర్వాల్ మొదటి సినిమాతోనే కూల్ అండ్ క్లాసిక్ హిట్ గా పేరు సంపాదించుకుంది . ఆ తర్వాత రెండో సినిమాకి మగధీర లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కాజల్ కొన్ని దశాబ్దాలు సినిమా ఇండస్ట్రీని ఏలేసింది .

టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీని చెడుగుడు ఆడేసింది . కాగా కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని బాబుకు జన్మనిచ్చిన కాజల్ .. రీసెంట్గా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న కాజల్ .. నేడు పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంది . ఈ క్రమంలోనే కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నెక్స్ట్ చేస్తున్న సినిమాల అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి .

ఇలాంటి క్రమంలోనే కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుంది అన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అఖిల్ డేగల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సత్యభామ సినిమా కోసం నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది . రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ టైటిల్ను రివిల్ చేసిన విషయం తెలిసిందే .

అంతేకాదు ఎన్బికె 108 సినిమా కి కూడా కాజల్ ఇదే స్థాయిలో పారితోషకం అందుకుంటుందట. అంతేనా పుట్టినరోజు సందర్భంగా ఆమె ఒక క్రేజీ బోల్డ్ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లు తెలుస్తుంది . దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా రానుందట . ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో టాప్ పొజిషన్లో వెళ్ళిపోతున్న కాజల్ ఉన్నట్లుండి రెమ్యూనరేషన్ పెం చేయడం బోల్డ్ కంటెంట్ కు ఇంట్రెస్ట్ చూపించడంతో అభిమానులు సైతం షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news