Moviesసురేఖవాణి సినీ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఆ తెలుగు హీరోనా..?...

సురేఖవాణి సినీ కెరీర్ నాశనం అవ్వడానికి కారణం ఆ తెలుగు హీరోనా..? తెర పైకి షాకింగ్ మ్యాటర్..!!

సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న సురేఖవాణికి ఎలాంటి క్రేజ్ – డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పద్ధతిని చూసి ఎలాంటి రోల్స్ అయినా యాక్సెప్ట్ చేస్తుంది అన్న నిర్ణయానికి వచ్చేసారు మేకర్స్. అయినా ఎందుకో ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోలేకపోతుంది సురేఖ వాణి . ఈ మధ్యకాలంలో డ్రగ్స్ ఇష్యూ లో ఇరుక్కున్న విషయం తెలిసిందే.

డ్రగ్స్ తీసుకుంటుందో లేదో తెలియదు కానీ ఈ ఇష్యూలో మాత్రం ఆమె పేరు హైలెట్ గా వినిపిస్తుంది . ఇలాంటి టైం లోనే సురేఖ వాణి ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోవడానికి.. ఆఫర్లు రాకపోవడానికి కారణం మాస్ హీరో రవితేజ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఎస్ సోషల్ మీడియా న్యూస్ ప్రకారం రవితేజ కారణంగానే సురేఖ వాణికి అవకాశాలు ఇవ్వలేకపోతున్నారట. మనకు తెలిసిందే రవితేజ ప్రతి హిట్ సినిమాలోను భాగమైంది సురేఖ వాణి .

ఈ క్రమంలోనే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా టైంలో వీళ్ల మధ్య గొడవలు జరిగాయని .. ఆ గొడవలు కారణంగానే ఎవరు ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదని.. ఇలా సురేఖ వాణి కెరియర్ నాశనం అవ్వడానికి పరోక్షంగా కారణమయ్యాడు రవితేజ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు . అయితే ఎటువంటి రిమార్కు లేని రవితేజ పై ఇలాంటి నిందలు వేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఆమె ఏదో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసి అవకాశాలు దక్కించుకోకపోతే ..మా అన్న కారణమా..? అంటూ రవితేజ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news