Moviesగాజులు వేసుకోని మగాడు చేయలేని పని .. గాజులు వేసుకున్న కాజల్...

గాజులు వేసుకోని మగాడు చేయలేని పని .. గాజులు వేసుకున్న కాజల్ అగర్వాల్ చేసి చూపించిందిగా..వీడియో వైరల్..!!

టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ..పుట్టినరోజు నేడు. కాగ ఇండస్ట్రీలో ఆమె ఫాన్స్.. ఆమె ఫ్రెండ్స్ ..ఫ్యామిలీ మెంబర్స్.. అందరూ సోషల్ మీడియా వేదిక కాజల్ అగర్వాల్ బర్త డే శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ అగర్వాల్ నెక్స్ట్ సినిమా టైటిల్ ని .. టీజర్ను అనౌన్స్ చేసింది . కాక ఇప్పటికే బాలయ్య సినిమాలో ఆయనకు జోడిగా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ..మరొక క్రేజీ ప్రాజెక్ట్ ని ఫైనలైజ్ చేసింది.

కాగ వివాహం తర్వాత వరుసగా కమర్షియల్ చిత్రాలు చేస్తూనే వైవిధ్యమైన చిత్రాలకు సైన్ చేస్తుంది కాజల్. అలాగే లేడీ ఓరియంటెడ్ ఫీలింమ్‌స్ లోను నటిస్తుంది . ఈ క్రమంలోనే అఖిల్ డేగల దర్శకత్వంలో కూడా ఓ సినిమాకి కమిట్ అయింది . కాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ – టైటిల్ రివీల్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించబోతుంది అంటూ రిలీజ్ అయిన టీజర్ ఆధారంగా తెలుస్తుంది .

అంతేకాదు టీజర్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక దొంగని నిజం రాబట్టడానికి కొడుతూ ఉంటాడు . అయినా సరే ఆ దొంగ నోరు విప్పడు . అయితే కారులో చీర కట్టుకొని చేతికి గాజులు వేసుకొని చాలా బోల్డ్ లుక్స్ లో పోలీస్ స్టేషన్ కి వచ్చిన కాజల్ అగర్వాల్ గాజులు వేసుకున్న చేతితో అతగాడిని రఫ్పాడించేస్తుంది . ఈ దెబ్బకి ఆ నొప్పి భరించలేక..అతగాడు నిజం చెప్పేస్తాను మేడం అంటారు .

దీంతో కాజల్ అగర్వాల్ కొంచెం సేపు నవ్వేస్తుంది. ఓ లేడీ కానిస్టేబుల్ గాజులు తీసి కొట్టొచ్చు కదా మేడం ..అంటే తీసి కొట్టాడుగా అంటూ పక్కన ఉన్న పోలీస్ ఆఫీసర్ ను చూపించి మాట్లాడుతుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ టీజర్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు రెడ్ కలర్ శారీలో చేతికి రెడ్ గాజులు వేసుకుని చాలా హాట్ గా బోల్డ్ గా కనిపించింది. దీంతో ఒక మగాడు చేయలేని పని కాజల్ చేసి చూపించింది అంటూ జనాలు మెచ్చుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news