Moviesఎన్టీఆర్‌తో పోటీ... స‌వాల్ చేసి మ‌రీ గెలిచిన కృష్ణ ...!

ఎన్టీఆర్‌తో పోటీ… స‌వాల్ చేసి మ‌రీ గెలిచిన కృష్ణ …!

హీరో కృష్ణ అంటే.. రికార్డుల‌కు మారు పేరు. ఆయ‌న తెలుగు సినిమా రంగాన్ని కొత్త మార్గం ప‌ట్టించార‌న డంలో సందేహం లేదు. అనేక ప్ర‌యోగాలు చేశారు. ఈస్ట్‌మ‌న్ క‌ల‌ర్‌ను ప‌రిచ‌యం చేసినా.. సినిమా స్కోప్‌ను ప‌రిచ‌యం చేసినా.. కృష్ణ‌కు కృష్ణే సాటి.. పోటీ అనే మాట ఇప్ప‌టికీ ఉంది. అంతేకాదు… అనేక సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో కృష్ణ నిర్మించారు. సినిమా రంగంలో పోటీ ఉండాల‌ని.. ఆరోగ్య‌క‌ర‌మైన పోటీతో ప్రేక్ష‌కుల‌ను మ‌రింత‌గా ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని ప‌దే పదే చెప్పేవారు.

అందుకే.. హీరో కృష్ణ పేరు తెలుగు సినిమా రంగంలో చిర‌స్థాయిగా నిలిచిపోయింది. ముఖ్యంగా అన్న‌గారు ఎన్టీఆర్‌తో హీరో కృష్ణ చాలా పోటీగా న‌టించేవారు. ఒక సంద‌ర్భంలో అన్న‌గారు ఒకే ఏడాది నాలుగు సినిమాల్లో న‌టించారు. వీటిలో మూడు హిట్ట‌య్యాయి. వీటిలో శ్రీకృష్ణ పాండ‌వీయం ఒక‌టి. ఈ విష‌యం కృష్ణ‌కు తెలిసింది. అంతే.. ఆయ‌న వెంట‌నే మ‌నం ఎనిమిది సినిమాలు చేద్దాం.. అని ప్ర‌క‌టించారు. ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ.. ఈ సంవ‌త్స‌రం ఎనిమిది సినిమాలు తీయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.

దీనికి సంబంధించి డేట్లు కూడా ఇచ్చారు. వీటిలో ఒకే రోజు నాలుగు సినిమాలు విడుద‌ల చేస్తున్న‌ట్టు కూడా ముందుగానే అంటే.. అస‌లు క‌థ కూడా రెడీ కాకుండానే కృష్ణ ప్ర‌క‌టించారు. అవి సంక్రాంతి రోజు వ‌స్తున్న‌ట్టు ప్లాన్ చేసుకున్నారు. అయితే.. ఈ వార్త‌పై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. క‌థ‌లేదు.. డైరెక్ట‌ర్ లేడు.. సినిమాలు ప్ర‌క‌టించ‌డం ఏంటి? అని అన్న‌గారు కూడా న‌వ్వుకున్నారు.

కానీ, కృష్ణ మాత్రం ప‌ట్టుబట్టి.. త‌నే క‌థ‌లు రెడీ చేసి.. ద‌ర్శ‌కుల‌తో మాట్లాడి.. 3 నెల‌ల‌కు రెండు సినిమాలు చొప్పున పూర్తి చేసుకున్నారు. ఇలా.. వ‌చ్చిన 8 సినిమాల్లో 7 సూప‌ర్ హిట్ కావ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. సాధార‌ణంగా సంక్రాంతి రోజు.. వివిధ హీరోల సినిమాలు వ‌చ్చేవి. కానీ, ఆ ఏడాది మాత్రం సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌లైన రెండు, మూడు సినిమాలు హీరో కృష్ణ‌వే కావ‌డం గ‌మ‌నార్హం.

వీటిలో ఒక దానిని విజ‌య‌నిర్మ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నాలుగు కూడా హిట్ట‌య్యాయి. ఇలా.. అన్నగారితో పోటీ ప‌డి మ‌రీ విజ‌యం ద‌క్కించుకున్న హీరోగా కృష్ణ పేరు నిలిచిపోయింది. ఆ యేడాది అన్న‌గారిపై కృష్ణ త‌న సినిమాల‌తో పై చేయి సాధించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news