News"ఆదిపురుష్‌ " పబ్లిక్ టాక్ : ప్రభాస్ రాముడిగా హిట్టా..? ఫట్టా..?

“ఆదిపురుష్‌ ” పబ్లిక్ టాక్ : ప్రభాస్ రాముడిగా హిట్టా..? ఫట్టా..?

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ .. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా “ఆది పురుష్”. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితిమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . ఈ సినిమా అదే లెవెల్లో రిలీజ్ అయ్యి ఫస్ట్ షో తోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది . మనకు తెలిసిందే . బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ హిట్ కొట్టిందే లేదు. తీసిన రెండు సినిమాలు డిజాస్టర్ గా మారాయి .

ఈ క్రమంలోనే ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నాడు ప్రభాస్ . కాగా ఎక్స్పెక్టేషన్స్ని ఏమాత్రం తగ్గని రేంజ్ లో డైరెక్టర్ ఓం రావత్ ఆది పురుష్ సినిమాను వేరే లెవెల్ లో తెరకెక్కించారు . సినిమాలో విఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ బాగోలేవని నాసిరకంగా ఉన్నాయి అంటూ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేశారు . అయితే ఆ తర్వాత మళ్లీ వాటిని చేంజ్ చేసుకున్న ఓం రావత్.. అభిమానులు ఇష్టపడే రేంజ్ లో మౌల్డ్ అప్ చేసినట్లు తెలుస్తుంది .

అంతేకాదు రాముడిగా ప్రభాస్ నటించలేదు.. జీవించేసాడు అంటూ చెప్పుకొస్తున్నారు సినిమా చూసిన జనాలు . సీత పాత్రలో కృతి సనన్ కూడా అదే విధంగా మెప్పించింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు సినిమా మొత్తానికి హైలైట్ ఫస్ట్ హాఫ్ అని .. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగా ఇచ్చారని.. అందరికీ తెలిసిన స్టోరీ అయినా.. తనదైన స్టైల్ లో తెరకెక్కించడంలో ఓం రావత్ సక్సెస్ అయ్యారని చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోనే ఆది పురుష్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . చూడాలి మరి ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..? మొత్తానికి ప్రభాస్ రాముడిగా కొట్టాడు అనే చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news