MoviesNTR30: మరో క్రేజీ బ్యూటీని రంగంలోకి దించిన కొరటాల..జాన్వీకి తడిసిపోవాల్సిందేనా..?

NTR30: మరో క్రేజీ బ్యూటీని రంగంలోకి దించిన కొరటాల..జాన్వీకి తడిసిపోవాల్సిందేనా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ పేరు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనందరికీ తెలిసిన విషయమే . ఆయన రీసెంట్గా నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎలాంటి సూపర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అంతేనా ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని కోట్లాదిమంది ఇండియన్స్ కలను నిజం చేసింది . ఈ క్రమంలోనే హాలీవుడ్ గ్లోబల్ స్థాయిలో ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది .

ఈ క్రమంలోనే ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన చిన్న అప్డేట్ ని కూడా తెగ వైరల్ చేసేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోని హైదరాబాద్లో ప్రజెంట్ మొదటి షెడ్యూల్ ని జరుపుకుంటున్న ఎన్టీఆర్ 30 సినిమా త్వరలోనే గోవాలో సెకండ్ షెడ్యూల్ ని జరుపుకోబోతున్నట్లు ఓ రేంజ్ లో న్యూస్ వైరల్ గా మారుతుంది . అంతేకాదు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అని ..మొదటి నుంచి కొరటాల శివ చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మొదటి హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది . దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన ..ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు .

కాగా గోవాలో జరగబోయే షూటింగ్లో సెకండ్ హీరోయిన్ కూడా పాల్గొనబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అంతేకాదు ఆ హీరోయిన్ మరెవరో కాదు టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి . ఎస్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని చూస్ చేసుకున్నట్లు ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అంతేకాదు సినిమాలో తారక్ – సాయి పల్లవి పై ఒక క్రేజీ సాంగ్ డిజైన్ చేశారని రౌడీ బేబీ సాంగ్ కి మించిన రేంజ్ లో ఈ పాట ఉండబోతుంది అంటూ మేకర్స్ నుంచి అప్ డేట్ అందుతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తారక్ సాయి పల్లవి పేర్లును ట్రెండ్ చేస్తూ.. సాయి పల్లవి డ్యాన్స్ చేస్తే జాన్వీకి తడిసిపోవాల్సిందే అంటూ చెప్పుకొస్తున్నారు సాయి పల్లవి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news