Moviesబిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: అఖిల్ తో రొమాన్స్ చేయబోతున్న జాన్వీ కపూర్.....

బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్: అఖిల్ తో రొమాన్స్ చేయబోతున్న జాన్వీ కపూర్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే..!!

ఎస్ .. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే ఏజెంట్ సినిమాతో బిగ్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న అక్కినేని అఖిల్ త్వరలోనే హీరోయిన్ జాన్వి కపూర్ తో రొమాన్స్ చేయబోతున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు. అంతేకాదు దీనికి సంబంధించిన పనులు కూడా చకచకా పూర్తి చేసేస్తున్నారు మేకర్స్ అంటూ న్యూస్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే గత కొంతకాలంగా హిట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న అక్కినేని అఖిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా ఏజెంట్ .

సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . పరమ చెత్త కలెక్షన్ లు సాధించి అఖిల్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద నెగిటివ్ కామెంట్స్ దక్కించుకున్న సినిమాగా మిగిలిపోయింది . ఈ క్రమంలోని ఎలాగైనా సరే ఇండస్ట్రీలో హీరోగా సెటిల్ అవ్వాలి అని తన కొడుకు అఖిల్ అంటూ ఓ రేంజ్ లో కష్టపడుతున్న నాగార్జున ఫైనల్లీ తన ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తో సినిమాను ఫిక్స్ చేసినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అంతేకాదు అఖిల్ అక్కినేని జాన్వి కపూర్ సినిమా యువి క్రియేషన్స్ లో తెరకెక్కబోతుంది అంటూ క్రేజీ టాక్ వైరల్ గా మారింది . ఈ సినిమాని డైరెక్ట్ చేయబోయేది కొత్త దర్శకుడుగా తెలుస్తుంది. సాహో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన అనిల్ కుమార్ అనే డైరెక్టర్ తో అఖిల్ నెక్స్ట్ మూవీ ఉండబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది, కాగా ఇది టోటల్గా యాక్షన్ రొమాంటిక్ ధ్రిల్లర్ గా గా తెరకెక్కబోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. కాకపోతే ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని జాన్వికాపూర్ బోనికపూర్ ని నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి మరి ఒప్పించినట్లు తెలుస్తుంది . ఏది ఏమైనా సరే జాన్వి కపూర్ ముచ్చటగా మూడోసారి తెలుగులో మూడో సినిమాకి సైన్ చేయబోతుంది అంటూ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news