Moviesసమంత అంటే అనుపమ కు అంత కోపమా..? వాళ్ల మధ్య అంత...

సమంత అంటే అనుపమ కు అంత కోపమా..? వాళ్ల మధ్య అంత పెద్ద గొడవ జరిగిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత .. హీరోయిన్ అనుపమ పరమేశ్వరణ్ మధ్య గొడవలు జరుగుతున్నాయా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ గొడవలు ఇప్పటివి కాదు రంగస్థలం సినిమా నాటి వని తెలుస్తుంది . మనకు తెలిసిందే సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన రంగస్థలం సినిమా ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అయిందో . రాంచరణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా రికార్డ్ నెలకొల్పింది. సమంతకు స్టార్ హీరోయిన్గా స్టార్డం తెచ్చి పెట్టింది ఈ సినిమానే. అయితే ఇలాంటి సినిమాని మిస్ చేసుకునింది అనుపమ పరమేశ్వరణ్.. అది కూడా చేతులారా . నిజానికి సమంత రోల్ లో ఫస్ట్ అనుకున్న హీరోయిన్ అనుపమట. ఈ సంగతిని సుకుమార్ ఓపెన్ గా చెప్పుకొచ్చాడు .

అయితే ఆడిషన్ అంతా అయ్యాక అమ్మడు ఈ పాత్ర నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిందట. ఆడిషన్ లో చాలా బాగా చేసిందని ..ఒకే ఒక్క మైనస్ వాళ్ళ అమ్మ గారిని ఎక్కువగా చూస్తూ ఉండండి అని సుకుమార్ చెప్పుకొచ్చారు . అలా అనుపమ పరమేశ్వరన్ ఖాతాలో పడాల్సిన క్రేజీ హిట్ను సమంత ఎగరేసుకుపోయింది . ఆ తర్వాత మజిలీ సినిమా టైం లో ను సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన మజిలీ సినిమా..కి మొదట అనుకున్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అట. అయితే ఇక్కడ కూడా మళ్లీ ఆ పాత్రలో రియల్ వైఫ్ సమంత అయితే బాగుంటుంది అంటూ ఆడిషన్ అంతా అయ్యాక మళ్లీ సమంతనే చూస్ చేసుకున్నారు. అలా రెండోసారి అనుపమ పొట్ట కొట్టింది సమంత .

కాగా ముచ్చటగా మూడోసారి అనుపమ పరమేశ్వరన్ ఆఫర్లు ఎగరేసుకుపోయింది సమంత అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎస్ ప్రెసెంట్ సమంత టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది . ఈ క్రమంలోనే రీసెంట్ గా ఓ పాన్ ఇండియా ఫిలిం కి సైన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇది లేడీ ఓరియంటెడ్ ఫిలిం గా తెలుస్తుంది. దీంతో సమంత చాలా బోల్డ్ గా కనిపించబోతుందట . అయితే ఈ కథను ముందు డైరెక్టర్ అనుపమ పరమేశ్వరన్ కి చెప్పారట ..ఆమెనే హీరోయిన్గా కూడా అనుకున్నారట .

కాల్ షీట్లు కూడా రెడీ చేసుకునేసిందట. ఈ మధ్యకాలంలో అనుపమ పరమేశ్వరణ్ ఎన్ని హిట్లు కొట్టిందో మనకు తెలిసిందే. వరుసగా బ్యాక్ టూ బ్యాక్ హ్యాట్రిక్ హిట్లు కొట్టింది. అందుకే అనుపమను ఈ పాత్రకు చూస్ చేసుకున్నారట. అయితే లాస్ట్ మూమెంట్లో ఈ పాత్రను సమంతకి చెప్పి చూద్దాం.. ఓకే చేస్తే అనుపమని సినిమా నుంచి స్కిప్ చేద్దామంటూ మేకర్స్ గోల్డ్ డెసిషన్ తీసుకున్నారట అనుకున్న విధంగానే పాత్ర సమంతకు నచ్చింది అనుపమ ఖాతా నుంచి ఈ సినిమా అవుట్ అయింది ఇలా మూడుసార్లు సమంతా అనుపమ ఓకే లేదంటే లేదు అని ట్రై చేశారట. అను బ్యాడ్ లక్..సమంత కి కధ నచ్చేసింది. ఈ ఆఫర్ మళ్ళీ సమంతకే వెళ్లిపోయింది. అందుకే అనుకి సమంత అంటే అంత కోపం అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.దీంతో అనుపమ పరమేశ్వరణ్ – సమంత ల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news