Moviesఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను టెన్ష‌న్ పెడుతూ భ‌య‌పెట్టేస్తోన్న జాన్వీక‌పూర్ సెంటిమెంట్‌…!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను టెన్ష‌న్ పెడుతూ భ‌య‌పెట్టేస్తోన్న జాన్వీక‌పూర్ సెంటిమెంట్‌…!

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌కు త్రిబుల్ ఆర్ సినిమాతో నేషనల్ వైడ్‌గా తిరగలేని క్రేజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు నటిస్తున్న కొరటాల శివ, ప్రశాంత్ నీల్ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులను రాజమౌళి సెంటిమెంట్ బాగా భయపెడుతోంది. రాజమౌళి సినిమాలో నటించిన ఏ హీరోకు అయినా సూపర్ డూపర్ హిట్ వస్తుంది. ఆ వెంటనే ఎంత గొప్ప డైరెక్టర్ తో కలిసి పని చేసిన ఆ సినిమా ప్లాప్ అవుతుంది.

రాజమౌళి బ్యాడ్ సెంటిమెంటుకు ఎంతోమంది స్టార్ హీరోలు బలైపోయారు. రాజమౌళి సినిమాలో నటించి ఎంత పెద్ద సూపర్ హిట్ కొట్టినా ఆ తర్వాత సినిమా అట్టర్ ప్లాప్ అవుతుంది. గతంలో ఎన్టీఆర్ కూడా ఈ బ్యాడ్ సెంటిమెంట్ బాధితుడే. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులను జాన్వీ కపూర్ సెంటిమెంట్ కూడా బాగా భయపెడుతోంది. జాన్వీ కపూర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఐదేళ్లు దాటుతోంది.

ఈ ఐదు సంవత్సరాలలో ఆమె పలు సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల‌లోనూ నటించింది. హీరోయిన్గా విభిన్నమైన పాత్రలలో నటించింది. అయితే ఇప్పటివరకు ఏ ఒక్క పాత్రతోనో.. ప్రేక్షకులు చేత, విమర్శకులు చేత ఆమె వావ్ అనిపించలేదు. అసలు ఆమెకు కమర్షియల్ సక్సెస్ లేదు. అలాగే నటనతోను సర్ప్రైజ్ చేసిన దాఖలాలు కూడా లేవు. కేవలం శ్రీదేవి కూతురు అన్న బ్రాండ్ తో పాటు హాట్ హాట్ ఫోటోషూట్లు, వీడియోలు చేస్తూ బాలీవుడ్లో తన కుటుంబానికి ఉన్న పరిచయాలతో అవకాశాలు దక్కించుకుంటూ నటిస్తోంది.

అంతే త‌ప్పా వావ్ అన్న క్రేజ్ ఆమెకు అస్సలు లేదు. కేవలం సౌత్ ఇండియాలో కూడా ఆమె అమ్మ శ్రీదేవికి ఉన్న క్రేజ్ కారణంగానే ఇక్కడ మీడియా జాన్విని బాగా హైలెట్ చేస్తుందే తప్ప ఆమెకు అంత సీన్ లేదని చెప్పాలి. మరి ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో జాన్వీ ఎలా నటిస్తుందో అనే టెన్షన్ ఎన్టీఆర్ అభిమానుల్లో కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ అభిమానులు తెలుగు సినీ ప్రేక్షకులు తెలుగు మీడియా అయితే జాన్వి గురించి చాలా గొప్పగా ఊహించుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news