Moviesబాల‌య్య ' అఖండ 2 ' స్టోరీ లైన్ ఇదే… బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను...

బాల‌య్య ‘ అఖండ 2 ‘ స్టోరీ లైన్ ఇదే… బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను మించిన అరాచ‌కం..!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ – బోయ‌పాటి కాంబినేష‌న్ అంటేనే ఓ క్రేజీ కాంబినేష‌న్‌. వీళ్లిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు. ఇవి ఒక‌దానిని మించి మ‌రొక‌టి అన్న‌ట్టుగా హిట్ అయ్యాయి. అఖండ సినిమా నిజంగా ఈ ఏజ్‌లో బాల‌య్య కెరీర్‌కు తిరుగులేని ఊపిరిలూదింది. అఖండ త‌ర్వాత ప్ర‌స్తుతం రామ్‌తో బోయ‌పాటి ఓ యాక్ష‌న్ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు పూర్త‌య్యింది. ఈ యేడాది ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 20న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే మ‌రోసారి బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అఖండ‌కు సీక్వెల్ ఉంటుంద‌ని బోయ‌పాటి చెపుతూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే బోయ‌పాటి అఖండ 2 ప్రి ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఎప్ప‌టి నుంచో మొద‌లు పెట్టేశాడు.

జూన్ 10 న బాల‌య్య పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంద‌ని తెలుస్తోంది. ఇక అఖండ 2 లైన్ కూడా ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చింది. బాల‌య్య అఖండ సినిమాలో అఘోరాగా క‌నిపిస్తాడు. ఈ అఘోరా త‌న కుటుంబాన్ని కాపాడుకునేందు కోసం ఏం చేసింద‌న్న కాన్సెఫ్ట్‌తో అఖండ లైన్ ఉంటుంది. అయితే ఇప్పుడు అదే అఘోర ప్ర‌జాక్షేమం కోసం రాజ‌కీయ అవ‌తారం ఎత్తితే ఎలా ? ఉంటుంద‌న్న‌ది అఖండ సీక్వెల్లో చూపిస్తార‌ట‌.

అఖండ సినిమాలో శివుడితో పాటు శివ భ‌క్తిలో బాల‌య్య న‌ట విశ్వ‌రూపం చూపించారు. దీంతో అఖండ విజ‌యం న‌మోదు అయ్యింది. ఇప్పుడు అదే అఘోర రాజ‌కీయ అవ‌తారం ఎత్తితే ఇంకా ఏ రేంజ్‌లో బాల‌య్య న‌ట విశ్వ‌రూపం ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఈ సినిమాలోనూ బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news