Moviesఅన్న‌గారు రామారావు తరువాత.. ఇండ‌స్ట్రీని ఆ స్దాయిలో శాసించిన ఏకైక మగాడు...

అన్న‌గారు రామారావు తరువాత.. ఇండ‌స్ట్రీని ఆ స్దాయిలో శాసించిన ఏకైక మగాడు ఇతనే..ఎంత ధైర్యం అంటే..!!

అన్న‌గారు రామారావు తెలుగు ఇండ‌స్ట్రీని కొన్ని ద‌శాబ్దాల పాటు శాసించారు. ఏడాదికి 4 నుంచి 6 సినిమా లు కూడా వ‌చ్చిన సంద‌ర్భం ఉంది. స్వీయ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఆయ‌న అనేక సినిమాలు చేసేవారు. అదే స‌మ‌యంలో అగ్ర‌ద‌ర్శ‌కుల‌తోనూ న‌టించారు. ఒక ర‌కంగా చెప్పాలంటే.. అన్న‌గారికి పోటీగా ఎవ‌రూ ఉండేవారు కాదు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న సాహ‌సాల జోలికి ఏనాడూ పోలేదు.

దీంతో అన్న‌గారి హ‌వానే కొన‌సాగింది. అనేక రూపాల్లో అన్న‌గారు ఇండ‌స్ట్రీని ఒక స్టేజ్‌కు తీసుకువెళ్లారు. అయితే.. అన్న‌గారికి పోటీ ఎవ‌రూ లేర‌ని అనుకున్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా హీరో కృష్ణ తెర‌మీదికి వ‌చ్చారు. ఈయ‌న అంతా డేరింగ్ డ్యాషింగ్‌. సాధ్యం కాదు.. అని ఎవ‌రైనా అంటే.. చాలు ఆపన‌నిఇ సాధ్యం చేసి చూపించిన హీరో కృష్ణ‌. ఇలానే సీతారామ‌రాజు సినిమా తీశారు. ఇది సాద్యం కాద‌ని అంద‌రూ ప‌క్క‌న పెట్టారు.

కానీ, వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకుని కృష్ణ స్వీయ దర్శ‌క‌త్వంలో(ద‌ర్శ‌కుడు చ‌నిపోవ‌డంతో) సినిమా తీశారు. అయితే.. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న పేరు వేసుకోలేదు. ఇలా.. అనేక రూపాల్లో ఆయ‌న అన్న‌గారికి పోటీ ఇచ్చారు. అదేస‌మ‌యంలో ఒక ప‌త్రిక‌కు వ్య‌తిరేకంగా కూడా నిల‌బ‌డి.. సినిమా తీశారు. అన్న‌గారు రాజ‌కీయాల్లోకి వ‌చ్చాక కూడా.. ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా తీశారు. ఇలా తెలుగు ఇండ‌స్ట్రీని ఒకానొక ద‌శ‌లో శాసించేస్థాయికి వ‌చ్చారు.

అన్న‌గారు ఏడాదికి ఆరు సినిమాలు చేస్తున్నారు.. అని ఎవ‌రోచెప్ప‌గా.. తాను 10 సినిమాలు చేస్తానంటూ.. చేసి చూపించారు. ఇలా.. ఒక ద‌శ‌లో అయితే..ఏకంగా 15 సినిమాలు వ‌చ్చాయి. సంక్రాంతి రోజే మూడు సినిమాలు ఒకే రోజు విడుద‌ల చేసిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.అయితే.. ఇద్ద‌రూ ఎదురు ప‌డితే మాత్రం .. ఆప్యాయంగా ప‌ల‌క‌రించుకునేవారు. ద‌టీజ్ కృష్ణ‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news