Moviesఅక్కినేని నాగేశ్వ‌ర‌రావు పై ఇంత కుట్ర జరిగిందా..? ఆఖరికి చచ్చాడు...

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పై ఇంత కుట్ర జరిగిందా..? ఆఖరికి చచ్చాడు అంటూ కూడా ప్రచారం చేసారా..?

అక్కినేని నాగేశ్వ‌ర‌రావు.. 2014, జ‌న‌వ‌రి 22వ తేదీన హైద‌రాబాద్ లో కాలం చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా మీడియా స‌మావేశం పెట్టి చెప్పారు. నేను ఎక్కువ కాలం బ‌త‌క‌ను. మీరు ఎవ‌రూ నా గురించి అతిగా రాయొద్దు. నేను ప‌రిపూర్ణ‌మైన జీవితం అనుభ‌వించాను సినిమా రంగంలో ఇలాంటి జీవితం చాలా చాలా త‌క్కువ మందికి వ‌చ్చింది. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌.. ఆర్థిక బ‌లంన‌న్ను ఇన్నాళ్లు బ‌తికేలా చేసింది అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

అయితే.. దీనికి ముందు 1980ల‌లోనే అక్కినేని మ‌ర‌ణించారంటూ.. వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌ధాన ప‌త్రిక‌లు కొంత సంయ‌మ‌నం పాటించినా..సినిమా ప‌త్రిక‌లు ఏకంగా.. అక్కినేని ఇక లేరు! అని టైటిల్‌తో వార్త‌లు అచ్చేశాయి. ఇది అప్ప‌ట్లో తీవ్ర దుమారం రేపింది. దీనికి కార‌ణం ఏంటంటే.. ఇండ‌స్ట్రీలో దూకుడుగా ఉన్న స‌మ‌యంలోనే అక్కినేని గుండె స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డ్డారు.

దీంతో ఆయ‌న అమెరికా వెళ్లారు. అక్క‌డే గుండెకు ఆప‌రేష‌న్ చేయించుకున్నారు. ఈ స‌మ‌యంలో గుండె మార్పిడి ఆప‌రేషన్ జ‌రిగింద‌ని..ఒక జంతువు గుండెను ఆయన‌కు అమ‌ర్చార‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చాయి . అక్కినేనిఅమెరికా వెళ్లిన నాటి నుంచి ఆయ‌న తిరిగి వ‌చ్చే వ‌ర‌కు కూడా ఈ వార్త‌లు ఆగ‌లేదు. నిత్యం ఏదో ఒక సంచ‌ల‌నంతో వార్త‌లు రాశారు. ఇలానే ఒక రోజు హ‌ఠాత్తుగా అక్కినేని ఇక లేరు! అనే వార్త వ‌చ్చింది.

ఇది చ‌ద‌వి.. అక్కినేని అభిమానులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. దీనికి కార‌ణం.. అక్కినేని ఆప‌రేష‌న్ విష‌యంలో వ‌చ్చిన అంత‌ర్జాతీయ వార్త‌లే. సాధార‌ణంగా గుండె మార్పిడి ఆప‌రేష‌న్లు అప్ప‌ట్లో ప్ర‌యోగం కిందే లెక్క‌. అది కూడా తెలుగు న‌టుల్లో ఒక్క అక్కినేనికి మాత్ర‌మే జ‌రిగింది. దీంతో 48 గంట‌ల అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచారు. అయితే.. 48 గంట‌ల త‌ర్వాత కూడా.. ఎలాంటివార్తా రాక‌పోవ‌డంతో సినీ ప‌త్రిక‌లు అత్యుత్సాహానికి గురై.. అలా వార్త‌లు రాశాయి. త‌ర్వాత‌… అక్కినేని వ‌చ్చాక‌.. అన్నీ స‌ర్దుకున్నాయి. కానీ, ఆ వివాదం మాత్రం చాలా ఏళ్ల‌పాటు కొన‌సాగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news