Movies' విరూపాక్ష ' ఫ‌స్ట్ రివ్యూ.... ఆ ట్విస్టుతో ఫ్యీజులు ఎగిరి.....

‘ విరూపాక్ష ‘ ఫ‌స్ట్ రివ్యూ…. ఆ ట్విస్టుతో ఫ్యీజులు ఎగిరి.. మైండ్ బ్లాకే..!

మెగా హీరో సాయితేజ్ బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత న‌టించిన మొద‌టి సినిమా విరూపాక్ష‌. అయితే యాక్సిడెంట్‌కు ముందే న‌టించిన రిప‌బ్లిక్ సినిమా యాక్సిడెంట్ త‌ర్వాత రిలీజ్ అయ్యింది. మంచి టాక్ తెచ్చుకున్నా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం స‌క్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు విరూపాక్ష సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మించిన ఈ సినిమాకు సుకుమార్ క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు. ఈ నెల 21న పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ సినిమాపై హైప్ అయితే పెంచేసింది. అయితే ఈ సినిమాకు ఉన్న మైన‌స్ ఏంటంటే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన పాట‌ల్లో ఒక్క‌టీ హిట్ కాలేదు.

ఏ హీరో సినిమాకు అయినా రిలీజ్‌కు ముందు హైప్ రావాలి అంటే ముందుగా సాంగ్స్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కావాలి. కానీ విరూపాక్ష‌కు అదే పెద్ద మైన‌స్‌. ఇక ఏ స‌ర్టిఫికెట్ రావ‌డంతో ఈ సినిమా కొన్ని వ‌ర్గాల సినిమాయే అని.. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంత వ‌ర‌కు ? ఆక‌ట్టుకుంటుంద‌న్న సందేహాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రివ్యూ షో ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో వేశారు.

ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్ల‌తో పాటు కొంద‌రు సినీ ప్ర‌ముఖుల‌కు ఈ షో చూపించార‌ట‌. అయితే సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు హ‌ర్ర‌ర్ సీన్లు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వ‌చ్చిన సీన్లు అయితే మ‌తులుపోయేలా ఉన్నాయ‌ట‌. ఇటీవ‌ల కాలంలో ఇలాంటి థ్రిల్ల‌ర్ సినిమా చూడ‌లేద‌ని.. ఈ సినిమా ఖచ్చితంగా టాలీవుడ్‌లో సంచ‌ల‌నం క్రియేట్ చేస్తుంద‌నే చాలా మంది చెపుతున్నారు.

కేవ‌లం తెలుగులో మాత్ర‌మే కాదు.. ఇత‌ర భాష‌ల్లోనూ ఈ సినిమా త‌ప్ప‌కుంగా విజ‌యం సాధిస్తుంద‌ని.. అంత మంచి పాన్ ఇండియా కంటెంట్ ఈ సినిమా లో ఉందంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ స్టార్టింగ్‌లో వ‌చ్చే ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్‌గా ఉంద‌ట‌. మ‌రి విరూపాక్ష అస‌లు స‌త్తా ఏంటో ఈ నెల 21న తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news