Newsప్రభాస్‌తో హాట్ బ్యూటీ నమితకు అలాంటి రిలేషన్... ఇన్నాళ్ల‌కు బయటపడ్డ నిజం..!

ప్రభాస్‌తో హాట్ బ్యూటీ నమితకు అలాంటి రిలేషన్… ఇన్నాళ్ల‌కు బయటపడ్డ నిజం..!

జెమిని సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ న‌మిత. మొద‌టి సినిమాతోనే న‌మిత సూప‌ర్ హిట్ ను అందుకుంది. అయితే ఈ గుజ‌రాతీ బ్యూటీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత సొంతం సినిమాలో న‌టించింది. ఆ త‌ర‌వాత తెలుగులో బిల్లా, సింహా సినిమాల‌లో న‌టించింది. బిల్లా సినిమాలో ప్ర‌భాస్ కు హీరోయిన్ గా అందాల ఆర‌బోత చేసింది. అంతే కాకుండా బికినీ అందాల‌తో కుర్రాళ్ల మ‌తులు పోగొట్టింది. ఆ త‌ర‌వాత న‌మిత బొద్దుగా త‌యార‌వ్వ‌డంతో ఆఫ‌ర్ లు త‌గ్గిపోయాయి.

అంతే కాకుండా రీసెంట్ గా న‌మిత పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయ్యింది. ఆమె భ‌ర్త పేరు వీరేంద్ర చౌద‌రి. ఇక సినిమాల‌కు దూరంగా ఉంటున్న న‌మిత తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంధ‌ర్బంగా న‌మిత ఆస‌క్తిక‌ర విషయాల‌ను వెల్ల‌డించింది. తాను చాలా మంది హీరోల‌తో ప‌నిచేశాన‌ని ప‌లువురు స్టార్ హీరోల‌కు జోడీగా న‌టించాన‌ని చెప్పారు. కానీ త‌న ఫేవ‌రెట్ మాత్రం ప్ర‌భాస్ అని అన్నారు. దానికి కార‌ణం ఆయ‌న వ్య‌క్తిత్వ‌మే అని న‌మిత చెప్పారు.

ప్ర‌భాస్‌ చాలా మంచి వార‌ని చాలా స్వీట్ అని అన్నారు. అంతే కాకుండా ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌భాస్ గౌర‌వం ఇస్తార‌ని అన్నారు. లైట్ మెన్ ద‌గ్గ‌ర నుండి కింది స్థాయి ప‌నివాళ్ల‌కు కూడా ప్ర‌భాస్ చాలా గౌర‌వం ఇస్తార‌ని తెలిపారు. ఆ విష‌యాలు అన్నీ ప్ర‌భాస్ వ‌ద్ద నుండి తాను నేర్చుకున్నాన‌ని అన్నారు. న‌మిత భ‌ర్త వీరూ మాట్లాడుతూ…ప్ర‌భాస్ – అనుష్క – న‌మిత ఒక కుట్టీ గ్యాంగ్ అని అన్నారు. త‌ర‌చూ న‌మిత త‌న‌కు వాళ్ల గురించి చెబుతుంద‌ని వీరూ తెలిపారు.

సూర్య న‌మ‌స్కారం చేయ‌డం మొద‌టిసారి తాను అనుష్క ద‌గ్గ‌ర నేర్చుకున్నాన‌ని అన్నారు. అనుష్క చాలా హార్డ్ వర్కింగ్ అని బిల్లా త‌న ఫేవ‌రెట్ సినిమా అని చెప్పారు. బిల్లా సినిమా ప్ర‌భాస్ పుట్టిన రోజుకు రీరిలీజ్ చేస్తున్నార‌ని అన్నారు.హైద‌రాబాద్ మ‌రియు భీమ‌వ‌రంలో విడుద‌ల చేస్తార‌న్నారు. ప్ర‌భాస్ సైలెంట్ అని కానీ స్నేహితులు ప‌క్క‌న ఉంటే చాలా మాట్లాడాతార‌ని చెప్పారు. ఇక ప్ర‌భాస్ నాటీ నా అంటూ యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా అస్స‌లు కాదు అంటూ న‌మిత స‌మాధానం ఇచ్చారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news