Moviesవర్ష జుట్టు పట్టుకుని అడిగి కడిగేసిన సుజాత..? రాకేష్ తో అలాంటి...

వర్ష జుట్టు పట్టుకుని అడిగి కడిగేసిన సుజాత..? రాకేష్ తో అలాంటి పనులు చేస్తుందా..?

ఈ మధ్యకాలంలో బుల్లితెరపై పలు షోలు టిఆర్పి రేటింగ్ సంపాదించుకోవడానికి.. ఏ రేంజ్ లో తప్పుదావ పడుతున్నారో మన అందరికీ బాగా తెలిసిన విషయమే. కొన్ని ఎక్స్పోజింగ్ దారి చూపిస్తే ..మరికొందరు వల్గారిటీ దారి మరికొందరు ..బూతులతో మరికొందరు రెచ్చిపోతున్నారు . కాగా రీసెంట్గా జబర్దస్త్ లో అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు రాకింగ్ రాకేష్ ..ఆయన భార్య సుజాత. రీసెంట్ స్కిట్ లో రాకింగ్ రాకేష్ సుజాత రెచ్చిపోయి పెర్ఫార్మన్స్ చేశారంటున్నారు జనాలు .

రీసెంట్ ఎపిసోడ్ ఎదురెదురుగా ఓ హోటెల్ పెట్టుకొని నిద్ర లేచిన మొదలు గొడవ పడుతూనే ఉంటారు . కాగా స్కిట్లో భాగంగానే రాకేష్ – సుజాత పచ్చి బూతులతో తిట్ల పురాణం స్టార్ట్ చేశారు. అంతేకాదు పొద్దు పొద్దునే దరిద్రం దాన్ని చూడాల్సి వచ్చింది అంటూ లేడీ గెటప్ లో ఉన్న రాకింగ్ రాకేష్ తిట్లు స్టార్ట్ చేస్తే.. దానికి ఏమాత్రం తగ్గని సుజాత కౌంటర్ వేస్తు దరిద్రపు మొహాన్ని చూసిన నేను కూడా దరిద్రపుగొడ్డు దాన అంటూ రెచ్చిపోయింది . దీంతో కాసేపు అక్కడ నవ్వులు పూసాయి .

అంతేకాదు ఆ తర్వాత సుజాత స్కిట్ ని పిక్స్ కు తీసుకెళ్లారు . అనంతరం సుజాత మరింత ఫైర్ అవుతూ రెండు కాళ్లు పైకి లేపి మెట్లతో కొడతా ఏమనుకుంటున్నావో అంటూ ఘాటు ఘాటుగా బూతు పదాలను వాడింది . రాకేష్ సింపతి క్రియేట్ చేయడానికి స్టేజ్ దిగి పక్కనే ఉన్న వర్ష దగ్గరికి వెళ్లి ఓడిలో కూర్చుంటారు . దీంతో ఒక్కసారిగా వర్ష షాక్ అయిపోతుంది. అక్కడున్న జనాలు కూడా షాక్ అయిపోతారు. మనకు తెలిసిందే రాకింగ్ రాకేష్ కి పెళ్లయింది . అలా ఒక అమ్మాయి ఒళ్లో ఎలా కూర్చుంటాడు అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు .

అంతేకాదు ఇది గమనించిన సుజాత కూడా రెచ్చిపోయి కోపంతో స్టేజి దిగి వచ్చి..”వర్ష జుట్టు పట్టుకొని దబా దబా” అంటూ బాధేసింది . అంతేకాదు స్కిట్లో భాగంగా అలా చేసింది అనుకోవడానికి లేదు.. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం నిజంగానే కోపంగా కొట్టినట్లే ఉంది.. నా మొగుడిని నువ్వు ఒళ్లో కూర్చోబెట్టుకుంటావేంటి అంటూ ఫైట్ చేసేసింది “. అయితే రాకింగ్ రాకేష్ ఇలా చెత్తగా ప్రవర్తించడం జనాలకి నచ్చట్లేదు .. నిన్నకాక మొన్న పెళ్లి అయిన మీరు ఇలాంటి చెత్త చెత్త స్కిట్స్ చేస్తున్నారే.. కామెడీ కోసం ఇలాంటివి కూడా చేస్తారా..? అంటూ జనాలు మండిపడుతున్నారు. అంతేకాదు సుజాత నువ్వు గాని తగ్గితే నీ మొగుడు నెత్తినెక్కి తాండవం చేస్తాడు.. రాకేష్ ని కంట్రోల్లో పెట్టుకో ..జాగ్రత్త అంటూ సజెషన్స్ ఇస్తున్నారు. మరికొందరు నిజంగానే రాకింగ్ రాకేష్ కి వర్షకి మధ్య ఏదైనా ఉందేమో .. ? సుజాత అది కనిపెట్టిందేమో..? అందుకే ఇలా చేస్తుందేమో ..? అంటూ పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news