Moviesపెళ్లానికి ఫ్రెగ్నెంట్ అని ఆ హీరో మోసం చేశాడు... హీరోయిన్ సంఘ‌వి...

పెళ్లానికి ఫ్రెగ్నెంట్ అని ఆ హీరో మోసం చేశాడు… హీరోయిన్ సంఘ‌వి సంచ‌ల‌నం..!

టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్లు.. సీనియర్ హీరోయిన్లు అందరూ ఇప్పుడు చాలా రోజుల తర్వాత బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరికొందరు హీరోయిన్లు వెండి తెరపై రీ ఎంట్రీ ఇవ్వటానికి కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. వెండితెరపై అమ్మ, అత్త, అక్క పాత్రలతో ఆకట్టుకుంటున్నారు.. ఇప్పటికే చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే కస్తూరి – అర్చన – రాధా – నదియా – ఇంద్రజ – మీనా – రాశి – సిమ్రాన్ – ప్రేమ – జ్యోతిక – సంఘవితో పాటు చాలామంది నటీమణులు బుల్లితెరపై రీ ఎంట్రీ ఇస్తూ బిజీబిజీ అవ్వటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల జాబితా చాలా పెద్దగానే ఉంది. అలాంటి వారిలో నటీమణులు మీనా – ప్రీత – సంఘవి – సంగీత – మహేశ్వరి ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఒక టీవీ షోలో పాల్గొన్న సంఘవి ప్రముఖ నటుడు.. గతంలో విలన్ పాత్రలు చేసిన బబ్లు పృథ్వీరాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయ‌న‌ తనను మోసం చేశాడని ఆమె చెప్పింది. తాజాగా మహేశ్వరి, పృథ్వి, ఆకాష్, సంఘవి అందరూ కలిసి ఈటీవీ క్యాష్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే పృథ్వి చేసిన మోసం బట్టబయలు చేసింది. సంఘవి ఒకరోజు షూటింగ్ ముగించుకుని రాత్రి సమయంలో సంఘవి ఇంటికి వెళుతుందట. ఆ టైంలో పృథ్విరాజ్ వచ్చి నా భార్య ప్రెగ్నెంట్.. వీళ్ళు కేక్ అడిగితే ఇవ్వటం లేదు అనడంతో.. సంఘవి చాలా సీరియస్ గా రెస్టారెంట్ కి వెళ్లి కేక్ ప్యాక్‌ చేయించి మరి తెచ్చి ఇచ్చిందట. తర్వాత కొద్ది రోజులకు ఎయిర్ పోర్టులో సంఘవికి పృథ్వి తో పాటు అతడు వైఫ్ కనిపించారట.

ఆరోగ్యం ఎలా ఉంది ? ఎన్నో నెల అని సంఘవి అడిగిందట. వెంటనే పృథ్వి భార్య నాకు నెలలు నిండటం ఏంటని షాక్‌తో అడిగిందట. అప్పటికి పృథ్వి తనను మోసం చేసి కేక్ తీసుకు వెళ్ళాడు అన్న విషయం అర్థమైందట. అయితే వెంటనే మహేశ్వరి పృథ్వి గారు ప్రెగ్నెంట్ ఏమో ? అని అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news