Moviesనాగ‌బాబు భార్య ఆ స్టార్ హీరోకు వీరాభిమానా… ఆ హీరో కోసం...

నాగ‌బాబు భార్య ఆ స్టార్ హీరోకు వీరాభిమానా… ఆ హీరో కోసం ఏం చేసిందో తెలుసా..!

టాలీవుడ్ లో మెగా బ్రదర్ నాగబాబు తన అన్న చిరంజీవి బాట‌లోనే సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రారంభంలో నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలలో కనిపించారు. చిరంజీవి అంత స్టార్ హీరో కాకపోయినా చిన్నా చితకా పాత్రలతో తాను సినిమాలలో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. అయితే నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ మాత్రం టాలీవుడ్ లో ఇప్పుడు యంగ్ హీరోల్లో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నారు. టాలీవుడ్ లో ఉన్న టైర్ టు హీరోలలో వరుణ్ తేజ్ మార్కెట్ మామూలుగా లేదు.

ఇక నాగబాబు కుమార్తె నిహారిక కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి రెండు మూడు సినిమాలు చేయడంతో పాటు అటు బుల్లితెర మీద కూడా తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుంది. ఇప్పటికే నిహారికకు పెళ్లిచేసిన నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్‌కు కూడా త్వరగా పెళ్లి చేసి రిలాక్స్ అయిపోవాలని చూస్తున్నారు. నాగబాబు అటు నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు తీశారు. చిరంజీవితో జాతీయ అవార్డు వచ్చిన రుద్రవీణ సినిమా నిర్మించగా.. చిరు తనయుడు రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమా చేశారు.

ఆరెంజ్‌ సినిమా ప్లాప్ అవడంతో చాలా రోజులపాటు గ్యాప్ తీసుకుని మళ్ళీ బన్నీ హీరోగా నా పేరు సూర్య సినిమాతో నిర్మాతగా మారారు. ఇక నాగబాబు భార్య పద్మజ పూర్తిగా భర్త చాటు భార్య‌గా ఉంటారు. నాగబాబుకు 29 సంవత్సరాల వయసు వచ్చేవరకు పెళ్లి కాలేదట. నాగబాబు తల్లి అంజలీదేవి కొడుకు కోసం చాలా సంబంధాలు చూసేవారట. ఈ క్రమంలోనే తమ బంధువుల పెళ్ళిలో పద్మజను చూసి ముచ్చటపడిన అంజనాదేవి.. ఆమె అయితేనే తన కొడుకుకు కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందని భావించారట.

ఆమె అలా అనుకోవడం ఆలస్యం.. వెంటనే అటువైపు కుటుంబ పెద్దలతో మాట్లాడి పెళ్లి సంబంధం ఖాయం చేసేశారు. పద్మజ మెగాస్టార్ చిరంజీవికి పెద్ద వీరాభిమాని. ఆమె చాగల్లులో చదువుకున్నప్పుడు నుంచే చిరంజీవి సినిమాల ఫోటోలు.. పేపర్ కటింగ్ తో పెద్ద ఆల్బమ్ తయారు చేసిందట. తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఆల్బమ్ చూపించి మురిసిపోయదట.

అలాగే తనకు కాబోయే అత్త అంజనాదేవికి కూడా ఈ ఆల్బమ్ చూపించడంతో అంజనాదేవి ఎంతో మురిసిపోయి అప్పటికప్పుడే ఆమెను తన కోడలుగా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అలా పద్మజా నాగబాబుకు భార్యగా మెగా ఫ్యామిలీ లో భాగం అయింది. ప్రస్తుతం పద్మజ తన కొడుకు వరుణ్‌కు కోడలని వెతికే పనిలో బిజీబిజీగా ఉన్నారు. ఇక వరుణ్ టాలీవుడ్ లో ఒక యంగ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్టు పుకార్లు వస్తున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news