Moviesరాజమౌళిని దెబ్బ‌ కొట్టేసేలా సుక్కు ప్లానింగ్ … ఏం చేస్తున్నాడంటే…!

రాజమౌళిని దెబ్బ‌ కొట్టేసేలా సుక్కు ప్లానింగ్ … ఏం చేస్తున్నాడంటే…!

టాలీవుడ్ లో గొప్ప దర్శకుడు ఎవరు అంటే కచ్చితంగా అందరి నోటి నుంచి వినిపించే పేరు దర్శకధీరుడు రాజమౌళి. అయితే బాహుబలి 1, బాహుబలి 2, తాజాగా త్రిబుల్ ఆర్ సినిమాలతో రాజమౌళి ఎవరికి అందనంత ఎత్తులోకి వెళ్లిపోయారు. అయితే నిన్న మొన్నటి వరకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు రెండో ర్యాంకులో ఉండేది. ఇప్పుడు సీన్ మారిపోయింది పుష్ప సినిమాతో బన్నీ, సుకుమార్ ఇద్దరు పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరుతెచ్చుకున్నారు.

ఎలాంటి అంచనాలను లేకుండా వచ్చిన పుష్ప సినిమా బాలీవుడ్ లో ఏకంగా 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇది మామూలు విషయం కాదు త్రివిక్రమ్‌కు నాన్ తెలుగులో అంత మంచి మార్కెట్ లేదు. త్రివిక్రమ్ సినిమాలు తెలుగు రాష్ట్రాల బయట.. ఓవర్సీస్ లో మినహాయిస్తే మిగిలిన భాషల్లో గొప్ప విజయాలు సాధించలేదు. కానీ పుష్ప సాధించిన విజయం చూశాక రాజమౌళికి పోటీ ఇచ్చే దర్శకుడు కచ్చితంగా సుకుమారే అవుతాడన్న ప్రశంసలు వస్తున్నాయి.

పుష్ప సాధించిన గొప్ప విజయం అలాంటిది. అందుకే పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న పుష్ప 2 ను సుకుమార్ చాలా జాగ్రత్తగా చెక్కుతూ వస్తున్నాడు. ఏ విషయంలోనూ రాజీపడటం లేదు. పుష్ప సినిమాకు భారీ లాభాలు వచ్చాయి. అందుకే పుష్ప 2 కోసం ఏకంగా రు. 500 కోట్ల భారీ బడ్జెట్ పెడుతున్నట్టు చెబుతున్నారు. అయితే నిన్న మొన్నటివరకు పుష్ప 2 టార్గెట్ వెయ్యికోట్లు అని ప్రచారం జరిగింది. అయితే సుకుమార్ పుష్ప 2 తో త్రిబుల్ ఆర్ సినిమాకు వచ్చిన రు. 1200 కోట్ల వసూళ్లను క్రాస్ చేసేలా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు బన్నీ టార్గెట్ కూడా అదే అంటున్నారు. ఎలాగైనా త్రిబుల్ ఆర్ సినిమా రికార్డులను కొట్టాలి. లోపల కూడా పుష్ప 2 కోసం అదే స్థాయిలో వర్క్ చేస్తున్నారట. ఇప్పటికే ఓ గవర్నమెంట్ గెస్ట్ హౌస్, ఒక పోలీస్ స్టేషన్ కు సంబంధించి షూట్ చేసిన ఫైట్ చాలా బాగా వచ్చిందని.. ఇది సినిమాకు హైలెట్ అవుతుందని ఇన్సైడ్ వర్గాల టాక్. సినిమాలో హీరో చాలా రిచ్ గెటప్‌ల‌లో రకరకాల కాస్ట్యూమ్స్ తో కనిపిస్తాడట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news